News June 5, 2024

ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాం: కలెక్టర్

image

జిల్లాలో ఓట్లలెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది ఎంతో నిబద్దతతో వ్యవహరిస్తూ.. వారి విధులు సక్రమంగా నిర్వహించారన్నారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న ఎన్నికల అబ్జర్వర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

Similar News

News November 3, 2025

నరసాపురం: భారీ దొంగతనం కేసులో చేధించిన పోలీసులు

image

నరసాపురం(M) తూర్పుతాళ్లులో గతేడాది సెప్టెంబర్‌లో బంగారు షాపులో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేధించారు. సోమవారం ఎస్పీ నయీమ్ అస్మి తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనానికి పాల్పడిన వారిలో నలుగురిని ఇవాళ అరెస్టు చేశారు. ఇదే కేసులో దొంగ బంగారం కొన్నట్లు తేలడంతో ముగ్గురు గోల్డ్ షాప్ యాజమానులపైనా కేసులు నమోదు చేశారు. మొత్తంగా 666గ్రా బంగారం, 2,638 గ్రాముల వెండి, నాలుగు బైక్స్ స్వాధీనం చేసుకున్నారు.

News November 3, 2025

భీమవరం: నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రారంభించిన మీ కోసం కాల్‌ సెంటర్‌ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) యథావిధిగా జరుగుతుందని ఆమె చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పీజీఆర్‌ఎస్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

News November 2, 2025

ఉండి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఉండి మండలం నక్కరాజగుంట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉండి నుంచి ఆకివీడు వెళుతున్న గంధం రాఘవులు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.