News June 5, 2024
‘మా’ నుంచి హేమ సస్పెండ్!

రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు బిగ్ షాక్ తగిలింది. ఆమెను ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ సస్పెండ్ చేసింది. ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా హేమ ప్రస్తుతం బెంగళూరులోని పరప్ప అగ్రహార జైలులో ఉన్నారు.
Similar News
News December 30, 2025
కొత్త సంవత్సరం ‘గ్రీటింగ్ స్కామ్స్’.. బీ అలర్ట్!

న్యూ ఇయర్ సందర్భంగా ‘గ్రీటింగ్ స్కామ్స్’ పట్ల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రజలను అప్రమత్తం చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్, SMS ద్వారా వచ్చే పర్సనలైజ్డ్ గ్రీటింగ్స్, న్యూ ఇయర్ గిఫ్ట్స్ లేదా బ్యాంకు రివార్డుల వంటి లింకులను క్లిక్ చేయొద్దని సూచించింది. లేదంటే ‘Malicious APK’ ఫైల్స్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యి బ్యాంక్ ఖాతా వివరాలు, OTPలు, వ్యక్తిగత ఫొటోలను దొంగిలించొచ్చని హెచ్చరించింది.
News December 30, 2025
NHIDCLలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు..

నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(<
News December 30, 2025
ఖలీదా జియా మరణం.. బంగ్లాతో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్లేనా?

బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న వేళ ఆ దేశ తొలి మహిళా ప్రధాని, BNP అధినేత్రి జియా <<18709090>>మరణం<<>> పెద్ద మలుపుగా మారింది. బంగ్లాలో ర్యాడికల్ గ్రూప్‌లు చెలరేగుతుండటంతో BNPతో భారత్ సత్సంబంధాల కోసం యత్నిస్తున్న వేళ ఈ పరిణామం జరిగింది. దీంతో బంగ్లాతో కొత్త ప్రయాణానికి బ్రేక్ పడొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.


