News June 5, 2024
ఆ మూడు రాష్ట్రాల్లో కలిపి కాంగ్రెస్‌కు రెండే సీట్లు!
సార్వత్రిక ఎన్నికల్లో 99 సీట్లు గెలిచిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లో కలిపి 64 సీట్లకు గాను రెండే గెలిచింది. TG(8), కర్ణాటక(9)లో మరిన్ని సీట్లు గెలిచే ఆస్కారమున్నా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు. ఒకవేళ ఈ 5 రాష్ట్రాల్లో మరిన్ని సీట్లు గెలిచుంటే ఆ పార్టీకి మొత్తం 120-130 సీట్లు వచ్చేవని, నాన్ ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Similar News
News November 28, 2024
మేం కక్ష సాధింపులకు పాల్పడట్లేదు: మంత్రి డోలా
AP: గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఎన్నో దారుణాలు చేశారని మంత్రి డోలా వీరాంజనేయస్వామి ఆరోపించారు. నాడు మూగబోయిన గొంతులు నేడు బయటకు వస్తున్నాయని, తప్పుచేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చి 5 నెలలు గడిచినా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని తెలిపారు. సెకీతో విద్యుత్ ఒప్పందాల విషయంలో స్కామ్ జరిగిందని, నష్ట నివారణ కోసం వైసీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెడుతున్నారని విమర్శించారు.
News November 28, 2024
‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదం ఓట్లు రాల్చడం లేదా?
‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదం కాంగ్రెస్‌కు ఓట్లు రాల్చడం లేదని విశ్లేషకుల అంచనా. LS ఎన్నికల నుంచి రాహుల్ గాంధీ ‘రాజ్యాంగ పుస్తకం’ చేతబూని పదేపదే రక్షిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనదిదే ఒరవడి. అయినా JKలో 6, హరియాణాలో 37, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో 16 చొప్పునే సీట్లు వచ్చాయి. ప్రజలు ఆ నినాదాన్ని నమ్మితే ఓటు షేరు, సీట్ల సంఖ్యలో ఎందుకు ప్రతిబింబించడం లేదని ప్రశ్న. మీరేమంటారు?
News November 28, 2024
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
AP: జనరల్, ఒకేషనల్ విభాగాల్లో ఇంటర్ ఫస్ట్, సెకండియర్, ప్రైవేటు విద్యార్థుల పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ఎలాంటి ఫైన్ లేకుండా వచ్చే నెల 5 వరకు చెల్లించవచ్చని తెలిపింది.