News June 5, 2024

ఎల్లుండి మరోసారి NDA భేటీ

image

ఎల్లుండి మరోసారి భేటీ కావాలని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి కూటమిలోని అన్ని పార్టీల ఎంపీలు హాజరుకానున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత ఈ మీటింగ్ ఉండనుంది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎన్డీయే నేతలు ఎల్లుండి రాష్ట్రపతిని కోరనున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రధాని ప్రమాణస్వీకారం, 10 లేదా 11న చంద్రబాబు ప్రమాణస్వీకారం ఉండే అవకాశం ఉంది.

Similar News

News November 28, 2024

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

AP: జనరల్, ఒకేషనల్ విభాగాల్లో ఇంటర్ ఫస్ట్, సెకండియర్, ప్రైవేటు విద్యార్థుల పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ఎలాంటి ఫైన్ లేకుండా వచ్చే నెల 5 వరకు చెల్లించవచ్చని తెలిపింది.

News November 28, 2024

కేటీఆర్ ఆరోపణలను ఖండించిన ఐపీఎస్‌ల సంఘం

image

సిరిసిల్ల కలెక్టర్, పోలీసులపై <<14720925>>KTR చేసిన ఆరోపణలను<<>> IPSల సంఘం ఖండించింది. సివిల్ సర్వీస్ అధికారులపై ఆయన చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తెలిపింది. కలెక్టర్ విశ్వసనీయతను ప్రశ్నించేలా ఆరోపణలు ఉన్నాయని, నిరాధార ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుందని పేర్కొంది. అధికారుల గౌరవం కాపాడేందుకు అండగా నిలబడతామని స్పష్టం చేసింది. SRCL కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలా పని చేస్తున్నారని KTR ఆరోపించారు.

News November 28, 2024

ప్రధాని మోదీని కలిసిన జైశంకర్

image

విదేశాంగ మంత్రి జైశంకర్ PM మోదీని కలిశారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై దాడుల నేపథ్యంలో ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలో చర్చించినట్లు తెలుస్తోంది. ఆ అంశంపై జైశంకర్ ప్రకటన చేస్తే ఉభయసభలు సజావుగా జరుగుతాయని BJP అధిష్ఠానం భావిస్తోంది. ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ అరెస్ట్ చేయగా అక్కడి హిందువులు నిరసన తెలిపారు. ఆ సమయంలో అడ్వకేట్ సైఫుల్ ఇస్లాం అలీ హత్య జరిగిన విషయం తెలిసిందే.