News June 5, 2024
ఐర్లాండ్ను కుప్పకూల్చిన భారత బౌలర్లు

T20WC: టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో ఐర్లాండ్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. భారత బౌలర్లు నిప్పులు చెరగడంతో బ్యాటర్లు చేతులెత్తేశారు. అర్ష్దీప్, హార్దిక్ ధాటికి ఆ జట్టు టాపార్డర్ కకావికలమైంది. 16 ఓవర్లు ఆడి 96 పరుగులకే ఆలౌటైంది. హార్దిక్ పాండ్య 3, అర్ష్దీప్ 2, బుమ్రా 2, అక్షర్ 1, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. ఆ జట్టులో గారెత్ డెలానీ (26)దే అత్యధిక స్కోరు.
Similar News
News January 15, 2026
రేపు ఈ పనులు చేస్తే సకల శుభాలు..

కనుమ రోజున పశువులను పూజించి, గ్రామ దేవతలను దర్శించి వారికి పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయని, సిరిసంపదలు సొంతమవుతాయని పండితులు సూచిస్తున్నారు. ‘నువ్వులతో చేసిన పదార్థాలను తీసుకోవాలి. పితృదేవతలను స్మరించుకోవాలి. పిండి వంటల నైవేద్యాలు పెట్టాలి. మద్యానికి దూరముండాలి. ఈ నియమాలు పాటిస్తే కుటుంబానికి, పశుసంపదకు మేలు జరగడమే కాకుండా వాటి నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది’ అంటున్నారు.
News January 15, 2026
సంక్రాంతికి విడుదల.. ఏ సినిమాకు వెళ్లారు?

సంక్రాంతి అనగానే సినిమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తాయి. పండగ వేళ ఇంటిల్లిపాదీ సినిమాకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి 5 సినిమాలు రిలీజయ్యాయి. ప్రభాస్ ‘రాజాసాబ్’, చిరంజీవి ‘MSVPG’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఈ జాబితాలో ఉన్నాయి. మీరు వీటిలో ఏ సినిమాకు వెళ్లారు? ఏ మూవీ నచ్చింది?
News January 15, 2026
ఆ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కాసేపట్లో తీర్పు!

TG: ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫిరాయింపునకు పాల్పడ్డారన్న MLAలు చింతా ప్రభాకర్, జగదీశ్ రెడ్డి ఫిర్యాదుపై ఇవాళ స్పీకర్ నిర్ణయం వెల్లడించనున్నారు. అంతకుముందు ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ తమ అనర్హతపై ఇంకా స్పీకర్కు వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీరి అనర్హత పిటిషన్లపై తీర్పునకు మరింత సమయం పట్టనుంది.


