News June 5, 2024

మదనపల్లె: ఉరి వేసుకుని ఆత్మహత్య

image

కుటుంబ సమస్యలతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మదనపల్లె మండలంలో జరిగిందని సీఐ శేఖర్ తెలిపారు. కోటవారిపల్లె తండాకు చెందిన చిన్నరెడ్డప్పనాయక్ కుమారుడు కృష్ణానాయక్(35) ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. భార్య అమ్రూ కూలి పనులకు వెళ్లడంతో ఇంట్లోనే చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిచూడగా భర్త చనిపోవడంతో బోరున విలపించింది.

Similar News

News March 3, 2026

చిత్తూరు: నేడు సెలవు

image

హోలీ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు మంగళవారం సెలవు ఇస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఎక్కడైనా పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అకడమిక్ క్యాలెండర్‌లో సెలవు దినంగా పేర్కొన్న బుధవారం (4వ తేదీ) సాధారణ పనిదినంగా ఉంటుందన్నారు.

News March 3, 2026

చిత్తూరు జిల్లాలో వారికి వారం రోజుల గడువు

image

గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, వివిధ క్లినిక్లకు చిత్తూరు DMHO సుధారాణి కీలక సూచనలు చేశారు. APMCE చట్టం ప్రకారం అనుమతి పొందేలా వారం రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలనన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకా గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఫిజియోథెరపీ యూనిట్లు డీఎంహెచ్‌వో వద్ద రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 3, 2026

చిత్తూరు పోలీసులకు 54 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 54 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 23 ఫిర్యాదులు ఉన్నాయి. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.