News June 5, 2024
ప.గో: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

తాడేపల్లిగూడెం పట్టణంలోని 2టౌన్ రాయల్ ఎన్ ఫీల్డ్ షోరూం వద్ద బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. యాచకుడు నిద్రపోతున్న సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు. మృతునికి 60 ఏళ్ల వయసు ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం పట్టణ పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 1, 2025
పోలవరం నిర్వాసితులకు రూ.1,100 కోట్లు.. నేడు చెక్కుల పంపిణీ

పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పరిహారం పంపిణీ ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా రూ.1,100 కోట్లు విడుదల చేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు వేలేరుపాడులో జరిగే కార్యక్రమంలో నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేయనున్నారు. జనవరిలో మిగిలిపోయిన వారికి, 41.15 కాంటూర్ పరిధిలోని మరికొన్ని గ్రామాలకు చెందిన నిర్వాసితులకు ఈ పరిహారం అందనుంది.
News November 1, 2025
ఫ్లై ఓవర్ పనుల జాప్యంపై కలెక్టర్ నాగరాణి ఆగ్రహం

తణుకు మండలం ఉండ్రాజవరం కూడలి వద్ద వంతెన నిర్మాణ పనుల జాప్యంపై భీమవరం కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జాప్యానికి కారణం ఏంటని నేషనల్ హైవే అధికారులను, గుత్తేదారుడి సహాయకుడిని ఆమె నిలదీశారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
News November 1, 2025
మహిళలను వేధిస్తే సహించం: కలెక్టర్ హెచ్చరిక

గృహహింస, మహిళలపై లైంగిక వేధింపులను సహించేది లేదని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో శుక్రవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పిల్లలు లేని దంపతులు పిల్లలను దత్తత తీసుకునే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు.


