News June 6, 2024
LS POLLS: తగ్గిన మహిళా ఎంపీల సంఖ్య
ఈ లోక్‌సభ ఎన్నికల్లో 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తే 74 మంది విజేతలుగా నిలిచారు. గరిష్ఠంగా బెంగాల్ నుంచి 11 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే మహిళా ఎంపీల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అప్పుడు 78 మంది మహిళలు ఎన్నికయ్యారు. దీంతో 18వ లోక్‌సభలో మహిళా ఎంపీల ప్రాతినిథ్యం 13.62శాతంగా ఉండనుంది. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News January 10, 2025
విరాట్, రోహిత్‌ను గంభీర్ తప్పించలేరు: మనోజ్ తివారీ
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను భారత జట్టు నుంచి తప్పించే సాహసం కోచ్ గంభీర్ చేయరని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. ఆఖరి టెస్టుకు రోహిత్ స్వచ్ఛందంగా పక్కన కూర్చుని ఉండి ఉంటారని తెలిపారు. ‘గంభీరే రోహిత్‌ను పక్కకు పెట్టారన్న వార్తలు కరెక్ట్ కాదనుకుంటున్నా. అయితే, జట్టు కోసమే చేసినా ఓ కెప్టెన్‌గా రోహిత్ అలా తప్పుకుని ఉండాల్సింది కాదు’ అని పేర్కొన్నారు.
News January 10, 2025
అకౌంట్లోకి డబ్బులు.. కీలక ప్రకటన
TG: జనవరి 26 నుంచి రైతుభరోసా ఇవ్వనున్నట్లు CM రేవంత్ కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. సాగుయోగ్యమైన ప్రతీ ఎకరాకి రైతుభరోసా చెల్లిస్తామన్నారు. పంట వేసినా, వేయకున్నా నగదు చెల్లిస్తామన్నారు. అనర్హులకు రైతుభరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి స్థిరాస్తి, లే ఔట్‌లు, నాలా కన్వర్షన్ అయిన, మైనింగ్, ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు.
News January 10, 2025
నా వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించినవి కాదు: BR నాయుడు
AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తాను ఏదో అన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ‘సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్స్‌కి స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే నేను మాట్లాడా. నా వ్యాఖ్యలను పవన్‌కు ఆపాదించడం భావ్యం కాదు. మొన్న ఘటన జరిగిన వెంటనే భక్తులు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాను’ అని ఆయన Xలో రాసుకొచ్చారు.