News June 6, 2024

ఇద్దరు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ ఎత్తివేత

image

AP: ఐపీఎస్ అధికారులు బిందుమాధవ్, అమిత్ బర్దార్‌లపై సస్పెన్షన్‌ను ఎన్నికల సంఘం ఎత్తివేసింది. పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోవడంలో వీరు విఫలమయ్యారని వీరిపై ఈసీ వేటు వేసింది. మే 16న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది.

Similar News

News September 11, 2025

నన్ను టార్గెట్ చేస్తున్నారు: గడ్కరీ

image

ఇథనాల్ పెట్రోల్‌పై సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పెయిడ్ పొలిటికల్ క్యాంపెయిన్ జరుగుతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ కార్యక్రమంలో అన్నారు. కొందరు తనను టార్గెట్ చేస్తున్నారని, ఆ ప్రచారాన్ని పట్టించుకోవద్దని కోరారు. E20 పెట్రోల్ సురక్షితం అని, దాన్ని ప్రభుత్వ నియంత్రణ సంస్థలతో పాటు ఆటోమొబైల్ కంపెనీలు స్వాగతించాయని పేర్కొన్నారు. కాగా E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతోందనే ప్రచారం జరుగుతోంది.

News September 11, 2025

ALERT: కాసేపట్లో భారీ వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే మెదక్‌లో 14 సెం.మీ వర్షపాతం నమోదైంది. అటు హైదరాబాద్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు దంచికొడుతున్నాయి.

News September 11, 2025

4.61 ఎకరాలకు రూ.3,472 కోట్లు!

image

ముంబైలో RBI భారీ ధరకు 4.61 ఎకరాలను కొనుగోలు చేసింది. నారీమన్ పాయింట్‌లో ఉన్న ప్లాట్ కోసం ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRCL)కు ఏకంగా రూ.3,472 కోట్లు చెల్లించింది. అంటే ఒక ఎకరానికి దాదాపు రూ.800 కోట్లు. స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు అయ్యాయి. ఈ ఏడాది ఇండియాలో ఇదే అతిపెద్ద ల్యాండ్ ట్రాన్సాక్షన్ అని సమాచారం. ఆ ప్లాటు సమీపంలోనే బాంబే హైకోర్టు, ఇతర కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.