News June 6, 2024

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం?

image

AP: వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం సహా మూడు హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. వీటిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 6 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ్టితో ఆ గడువు ముగియనుంది. దీంతో నరసరావుపేటలో పిన్నెల్లి నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Similar News

News November 28, 2024

LOWEST RECORD: 42 పరుగులకే శ్రీలంక ఆలౌట్

image

సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శ్రీలంక కేవలం 42 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కమిందు మెండిస్(13), లహిరు కుమార(10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. లంకకు ఇదే అత్యల్ప స్కోరు. 2006లో PAK చేతిలో 73కు ఆలౌటైంది. SA బౌలర్లలో జాన్సెన్ 7 వికెట్లతో లంకేయులను ముప్పుతిప్పలు పెట్టారు. కొయెట్జీ 2, రబాడ 1 వికెట్ తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో SA 191 రన్స్ చేసింది.

News November 28, 2024

అప్పుడు అభిమానిగా.. ఇప్పుడు తోటి ఆటగాడిగా..

image

నితీశ్ కుమార్ రెడ్డి కోహ్లీకి వీరాభిమాని. 2018లో BCCI అవార్డులకు హాజరైన నితీశ్ విరాట్‌తో సెల్ఫీకి చాలా ట్రై చేశారు. కుదరలేదు. దూరం నుంచే విరాట్‌, తాను ఒకే ఫ్రేమ్‌లో ఉండేలా సెల్ఫీ తీసుకుని సంతోషపడ్డారు. కట్ చేస్తే.. 2024లో విరాట్ 81వ సెంచరీ సెలబ్రేషన్లో తానూ భాగమయ్యారు. సెంచరీ పూర్తవగానే తన హీరోని హగ్ చేసుకున్నారు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇది కదా సక్సెస్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

News November 28, 2024

నాపై కేసుల వెనుక కుట్ర: RGV

image

తనపై కేసుల విషయంలో దర్శకుడు RGV ట్విటర్‌లో పాయింట్ల రూపంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎక్కడికీ పారిపోలేదు. ఏడాది క్రితం చేసిన ట్వీట్లపై 2 వారాల క్రితం 4 వేర్వేరు జిల్లాల్లో కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందనేది నా అనుమానం. మీమ్స్‌పై కేసులు పెట్టాలంటే దేశంలో సగంమందిపై కేసులుంటాయి. మీడియా కాల్స్ భరించలేకే ఫోన్ ఆపేశాను. చట్టాన్ని గౌరవిస్తా. కానీ నా హక్కులు నాకున్నాయి’ అని ట్వీట్ చేశారు.