News June 6, 2024
100% స్ట్రైక్ రేట్ సాధించిన JSP & LJP
సార్వత్రిక పోరులో నిలిచిన రెండు ప్రాంతీయ పార్టీలు 100% స్ట్రైక్ రేట్ సాధించి సత్తా చాటాయి. ఏపీలో 21 అసెంబ్లీ, 2MP స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపిన జనసేన అన్నింట్లో గెలిచింది. అలాగే NDA కూటమి సీట్ల పంపకాల్లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి కేటాయించిన 5 MP స్థానాల్లో గెలిచింది. ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కృషితో అన్నిచోట్లా నెగ్గింది. దీంతో అందరిచూపు పవన్, చిరాగ్ పాశ్వాన్ వైపు మళ్లింది.
Similar News
News November 28, 2024
మంచి చేసినా.. బురద జల్లుతారా?: జగన్
AP: సగటున యూనిట్ విద్యుత్ కోసం రూ.5.10 ఖర్చు చేస్తున్నామని, కానీ యూనిట్ రూ.2.49కే అందించేందుకు సెకీ ముందుకొచ్చిందని జగన్ తెలిపారు. 17వేల మిలియన్ యూనిట్లు తీసుకోవడంతో యూనిట్‌కు రూ.2.61 సేవ్ అయినట్లేనని చెప్పారు. ఏడాదికి రూ.4,400 కోట్ల చెప్పున 25 ఏళ్లకు రూ.లక్ష కోట్లు ఆదా అయినట్లేనని వెల్లడించారు. ఇది రాష్ట్రానికి సంపద సృష్టి కాదా? అని ధ్వజమెత్తారు. మంచి చేస్తే బురదజల్లుతున్నారని మండిపడ్డారు.
News November 28, 2024
ఎల్లుండి ప్రభుత్వ స్కూళ్ల బంద్
TG: ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నెల 30న పాఠశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు SFI రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగానే ఈ బంద్ చేపడుతున్నట్లు తెలిపింది. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి, రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది.
News November 28, 2024
సెకీతో ఒప్పందంపై జగన్ స్పందన
AP: సెకీతో YCP హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందంపై వచ్చిన ఆరోపణలపై జగన్ స్పందించారు. ‘మనం కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం తీపికబురు అందించింది. తక్కువ రేటుకు విద్యుత్ ఇస్తామని సెకీ చెప్పింది. ISTS ఛార్జీలు లేకుండా రూ.2.49కి యూనిట్ విద్యుత్ ఇస్తామంది. రైతుల పట్ల ప్రభుత్వం చూపిన శ్రద్ధను అభినందించింది. AP చరిత్రలోనే అతి తక్కువ రేటుకు చేసుకున్న విద్యుత్ ఒప్పందం ఇది. దీనిపై ఆరోపణలా?’ అని మండిపడ్డారు.