News June 6, 2024

పార్టీలు చీల్చిన వారికి ఓటర్ల షాక్!

image

మహారాష్ట్రలో పార్టీలను చీల్చిన వారికి ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో షాక్ ఇచ్చారు. తన బాబాయి శరద్ పవార్ నుంచి NCPని దక్కించుకున్న అజిత్ పవార్‌ పార్టీ 4చోట్ల పోటీ చేస్తే ఒకచోట మాత్రమే నెగ్గింది. అటు శరద్ పవార్ సారథ్యంలోని NCP 10 చోట్ల పోటీ చేయగా 8 గెలిచింది. మరోవైపు శివసేన విషయంలోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. పార్టీని చీల్చిన ఏక్‌నాథ్ శిండే వర్గం 7చోట్ల గెలిస్తే ఉద్ధవ్ ఠాక్రే వర్గం 9MP సీట్లు గెలుచుకుంది.

Similar News

News November 28, 2024

బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టారు: జగన్

image

APలో ఆరోగ్యశ్రీ బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టారని YS జగన్ ధ్వజమెత్తారు. ‘కూటమి అధికారంలోకి రాగానే వాలంటీర్ల ఉద్యోగం పోయింది. సచివాలయ వ్యవస్థ అగమ్యగోచరంగా ఉంది. రూ.2800 కోట్ల విద్యాదీవెన బకాయిలు, రూ.1100 కోట్లు వసతి దీవెన బకాయిలు పెట్టడంతో విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదు. 108, 104 పడకేశాయి’ అని ఆరోపించారు.

News November 28, 2024

షమీకి బీసీసీఐ డెడ్‌లైన్!

image

BGT సిరీస్‌లోకి తీసుకునేందుకు మహ్మద్ షమీకి బీసీసీఐ డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఆడుతున్న షమీకి ప్రతి స్పెల్ అనంతరం బీసీసీఐ మెడికల్ టీమ్ చికిత్స అందిస్తోంది. ఆయన బరువెక్కువ ఉన్నారని, మరో 10రోజుల్లో తగినంత తగ్గి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని బీసీసీఐ చెప్పినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే మూడో టెస్టుకు షమీ అందుబాటులోకి రావొచ్చని అంచనా.

News November 28, 2024

మా పాలనలో ఎన్నో అమలు చేశాం: జగన్

image

AP: ప్రతి గ్రామంలో సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి, లంచాలు, వివక్ష లేకుండా ప్రతి కుటుంబానికి పథకాలు అందించామని జగన్ చెప్పారు. ‘క్యాలెండర్ ఇచ్చి మరీ పథకాలు అమలు చేశాం. రూ.2.73 లక్షల కోట్లు అకౌంట్లలో జమ చేశాం. ప్రభుత్వ బడులతో ప్రైవేట్ బడులు పోటీ పడేలా ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాం. ఆరోగ్య ఆసరా, మెడికల్ కాలేజీలు, RBK, ఉచిత పంటల బీమా వంటివి ఎన్నో మా హయాంలో తీసుకొచ్చాం’ అని ఆయన వెల్లడించారు.