News June 6, 2024

ఓటమితో సిగ్గుపడాల్సిన పని లేదు: నవీన్

image

ఒడిశాలో అధికారం కోల్పోయినందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర మాజీ CM నవీన్ పట్నాయక్ అన్నారు. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ MLAలతో ఆయన మాట్లాడారు. తాను తొలిసారి CM అయినప్పుడు రాష్ట్రంలో 70% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారని, దాన్ని 10శాతానికి తగ్గించానని గుర్తుచేశారు. 24ఏళ్లుగా రాష్ట్రానికి BJD సేవలందించిందని, ఇంకా పనిచేస్తూనే ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో BJPకి 78, BJDకి 51 సీట్లు వచ్చాయి.

Similar News

News November 28, 2024

పృథ్వీ షా నుంచి ఆటను ఎవరూ దూరం చేయలేరు: పాంటింగ్

image

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా టాలెంటెడ్ ప్లేయర్ అని పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నారు. తిరిగి ఆయన IPLలో అడుగుపెడతారని చెప్పారు. ‘నేను కలిసి పని చేసిన టాలెంటెడ్ ప్లేయర్లలో పృథ్వీ ఒకరు. ఆయన నుంచి ఆటను ఎవరూ దూరం చేయలేరు. వేలంలో అన్‌సోల్డ్‌గా మిగలడం బాధాకరం. యాక్సిలరేటర్ రౌండ్‌లోనైనా పృథ్వీని ఎవరో ఒకరు తీసుకుంటారని భావించా. కచ్చితంగా మళ్లీ ఆయన తిరిగి వస్తారు’ అని రికీ పేర్కొన్నారు.

News November 28, 2024

మరో వికెట్ తీస్తే బుమ్రా పేరిట ఆ రికార్డు

image

టెస్టుల్లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. ఆస్ట్రేలియాలో వచ్చే నెల 6 నుంచి జరిగే డే నైట్ టెస్టులో ఓ వికెట్ తీస్తే 2024లో 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలుస్తారు. పెర్త్ టెస్టులో ఆయన 8 వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. ఇక భారత స్పిన్నర్ అశ్విన్ 50 వికెట్ల మార్కుకు 4 వికెట్ల దూరంలో ఉన్నారు.

News November 28, 2024

విమానాలకు వెయ్యికిపైగా బెదిరింపు కాల్స్

image

దేశీయ విమాన సంస్థ‌ల‌కు ఈ ఏడాదిలో న‌వంబ‌ర్ 13 వ‌ర‌కు 994 న‌కిలీ బాంబు బెదిరింపులు వ‌చ్చిన‌ట్టు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్ర‌యాణికుల‌ భద్రతకు సంబంధించి పటిష్ఠమైన ప్రోటోకాల్‌ అమలు చేస్తామని తెలిపింది. అదే 2022 ఆగస్టు-2024 నవంబర్ 13 వరకు మొత్తం 1,143 బెదిరింపు కాల్స్ వ‌చ్చాయంది. వీటి విష‌యంలో క‌ఠిన చ‌ర్య‌ల కోసం Civil Aviation Act 1982, Aircraft (Security) రూల్స్‌ను స‌వ‌రించ‌నున్న‌ట్టు తెలిపింది.