News June 6, 2024
గుంటూరు ఇండిపెండెంట్ MP అభ్యర్థికి 172 ఓట్లు

గుంటూరు ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి ఎం. నాగరాజుకు కేవలం 172 ఓట్లు వచ్చాయి. ఈయనతో పోలిస్తే నోటాకు వచ్చిన ఓట్లు చాలా ఎక్కువ(7387)గా ఉన్నాయి. మరోవైపు, మూడో స్థానంలో ఉన్న సీపీఐ అభ్యర్థికి 8,637 వచ్చాయి. గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజారిటీతో గెలవగా.. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు 5,20,253 ఓట్లు పోల్ అయ్యాయి.
Similar News
News December 27, 2025
RUB సాధ్యపడదు: MP పెమ్మసాని

గుంటూరు శంకర్ విలాస్‌లో ROB మాత్రమే నిర్మిస్తున్నామని RUB సాధ్యపడదని MP పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేస్తున్నామని చెప్పారు. ముందుగా అనుకున్నట్లే DDR బాండ్లు, ROB నిర్మాణానికి ఖర్చు మొత్తం రూ.150 కోట్ల ఖర్చవుతుందని తెలిపారు. కొందరు కోరుకుంటున్నట్లు ఆర్యూబీ నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.
News December 26, 2025
GNT: పెదకాకాని హైవేపై ప్రమాదం.. చిధ్రమైన శరీరం

పెదకాకాని హైవేపై శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించగా, శరీరం నుజ్జునుజ్జై భయంకరంగా మారింది. మృతదేహం ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా మారింది. దీంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిగా భావించి మృతదేహాన్ని గుంటూరు కొవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకాయంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు.
News December 26, 2025
ఫ్లాష్.. గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ ఈయనే..!

సుమారు రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం భర్తీ చేసింది. టీడీపీకి చెందిన కుర్రా అప్పారావును ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసియాలోనే అతి పెద్దదైన మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవికి చాలామంది ఆశావహులు పోటీపడగా, అధిష్ఠానం కుర్రా అప్పారావును నియమించడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


