News June 6, 2024
అవసరమా.. ఇలాంటి సవాళ్లు

నేతల మాటలు, సవాళ్లు కొన్నిసార్లు శృతి మించి వారినే ముంచేస్తున్నాయి. అప్పట్లో తెలంగాణ వస్తే రాజకీయాలు వీడుతానన్న లగడపాటి అలా చేశారు. తాజాగా పవన్ గెలిస్తే తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్న ముద్రగడ ఈ మార్పుకు సిద్ధమవుతున్నారు. అప్పట్లో BRS విషయంలో నారాయణ చెవి కోసుకుంటానని, మునుగోడులో ఓడితే మళ్లీ పోటీ చేయనని కోమటిరెడ్డి శపథాలు చేశారు. ప్రజలకు పనులు, ఫలితాలు కావాలి తప్ప ఈ పర్సనల్ సవాళ్లు కాదు.
Similar News
News October 30, 2025
ఐఐఐటీ బెంగళూరులో ఉద్యోగాలు

ఐఐఐటీ బెంగళూరు 5 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Sr రీసెర్చ్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్, సాఫ్ట్వేర్ డెవలపర్, రీసెర్చ్ ఇంటర్న్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తును srinivas.vivek@iiib.ac.in మెయిల్‌కు పంపాలి. వెబ్సైట్: https://iiitb.ac.in
News October 30, 2025
వర్షాలు – 90 రోజుల పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు(1/2)

పత్తి పూత, కాయ ఏర్పడి, వృద్ది చెందే దశలో ఉంటే ముందుగా పొలంలో మురుగు నీటిని బయటకు తొలగించాలి. పంటలో చాళ్లను ఏర్పాటు చేసి మొక్కల్లో గాలి, కాంతి ప్రసరణ పెంచాలి. 2% యూరియా లేదా 2%పొటాషియం నైట్రేట్ లేదా 2% 19:19:19+ 1% మెగ్నీషియం సల్ఫేట్‌తో పాటు వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. లీటరు నీటికి 5గ్రా. బోరాక్స్ కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని ఏపీ వ్యవసాయశాఖ సూచించింది.
News October 30, 2025
వర్షాలు- 90 రోజుల పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు(2/2)

కాయకుళ్ళు నివారణకు లీటరు నీటికి 3గ్రా కాపర్ ఆక్సిక్లోరైడ్ +0.1గ్రా స్ట్రెప్టోసైక్లిన్ కలిపి మొక్కల కింది భాగపు కొమ్మలు, పచ్చటి కాయలు తడిచేలా పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు రాకుండా 3గ్రా. మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయరాలడం ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ప్లానోఫిక్స్(4.5% నాఫ్తలిన్ అసిటిక్ యాసిడ్) 0.25ml కలిపి పిచికారీ చేయాలని ఏపీ వ్యవసాయశాఖ సూచించింది.


