News June 6, 2024
నటి హేమను విచారిస్తున్న బెంగళూరు పోలీసులు

AP: రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమను బెంగళూరు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. బెంగళూరులో రేవ్ పార్టీలో పాల్గొనడంతో పాటు డ్రగ్స్ తీసుకున్నారనే అభియోగాలతో ఆమెను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం ఆనేకల్ కోర్టులో హాజరుపర్చారు. ఆమెను ఒక రోజు విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతిచ్చింది. ఇవాళ సాయంత్రం ఆమెను తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు.
Similar News
News September 9, 2025
‘స్వదేశీ మేళా’లు నిర్వహించండి.. NDA ఎంపీలకు ప్రధాని పిలుపు

మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు NDA ఎంపీలు ‘స్వదేశీ మేళా’లను నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. GST రేట్ల తగ్గింపుపై వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని, GST సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు MPలు తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో NDA MPలతో ఆయన సమావేశమయ్యారు. ఓటు వృథా కాకుండా సరైన పద్ధతిలో వేయాలన్నారు.
News September 9, 2025
పంజాబ్ వరదలు.. భజ్జీ మంచి మనసు

భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైన పంజాబ్‌కు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ తన వంతు సాయం చేశారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు 11 స్టీమర్ బోట్లు, 3 అంబులెన్సులు, రూ.50 లక్షలను సేకరించి విరాళంగా అందించారు. కాగా భారీ వర్షాలకు పలు ఘటనల్లో పంజాబ్‌లో 48 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరదలతో పంట నష్టపోయిన చోట ఎకరాకు రికార్డు స్థాయిలో రూ.20 వేల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది.
News September 9, 2025
ఆ కంపెనీలపై ట్రంప్ పన్ను పోటు!

అమెరికాలో విదేశీ వర్కర్లను నియమించుకునే కంపెనీలపై 25 శాతం అదనంగా పన్నులు విధించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పన్నులు ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత అమలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ విధానం తీసుకొస్తున్నట్లు సమాచారం.