News June 6, 2024

HYD: భర్తను బెదిరించేందుకు ఆత్మహత్యాయత్నం

image

భర్తను బెదిరించేందుకు ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాజేంద్రనగర్ PS పరిధి కిస్మత్పూర్‌లో సామెల్, గోవిందమ్మ నివాసం ఉంటున్నారు. సామెల్ మరో స్త్రీతో కనిపించినట్లు గోవిందమ్మతో ఓ మహిళ చెప్పింది. దీంతో గోవిందమ్మ ఆత్మహత్యాయత్నం చేయగా సామెల్ ఆసుపత్రికి తరలించాడు. కాగా సామెల్‌ గోవిందమ్మతో మాట్లాడిన మహిళపై దాడి చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Similar News

News January 26, 2026

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

image

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని మేయర్ ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి పలువురు వికలాంగులకు పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News January 26, 2026

మువ్వన్నెల శోభతో బల్కంపేట ఎల్లమ్మ

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ గర్భగుడిని తీవర్ణపతాక రంగులతో అలకరించారు. వివిధ రకాల పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. అమ్మవారి ఈ అపూర్వ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

News January 26, 2026

HYDలో ‘గణతంత్ర’ వేడుకులు.. దీనికి అర్థం తెలుసా?

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగర వ్యాప్తంగా మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతోంది. మరీ గణతంత్రం అంటే అర్థం తెలుసా? ‘గణతంత్రం’ అనేది ప్రజలకు అధికారం కలిగిన పాలనా విధానం. ఇందులో దేశాధినేతను ప్రజలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎన్నుకుంటారు. రాజు లేదా వారసత్వ పాలకుడు ఉండరు. తమను తాము పరిపాలించుకుంటామని ఓటు హక్కుతో ప్రతినిధులను ఎన్నుకుని దేశ పాలనను నిర్వహింపజేస్తారు.
*నేడు 77వ గణతంత్ర దినోత్సవం