News June 6, 2024
కురిచేడు: రిజర్వాయర్‌లో పసికందు మృతదేహం

కురిచేడు మండలం అట్లపల్లి రిజర్వాయర్‌లో పసి కందు మృతదేహం బయటపడింది. బుధవారం సాయంత్రం చెరువు పక్కనే పొలం పనులు చేసుకునే వారు కట్టమీద వెళుతుండగా పసికందు మృతదేహాన్ని గుర్తించారు. రెండు రోజుల క్రితం ముగ్గురు మహిళలు చెరువు కట్టమీద అనుమానస్పదంగా తిరుగుతూ బిడ్డను వదిలేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఎన్‌ఏపీ రక్షిత నీటి పథకం సిబ్బంది వెంటనే ఆ మృతదేహాన్ని బయటకు తీసి చెరువును శుభ్రం చేశారు.
Similar News
News December 30, 2025
కొత్తగా ప్రకాశం జిల్లా ఇలా..!

☞ జిల్లా కేంద్రం: ఒంగోలు
☞ డివిజన్లు: 3 (కందుకూరు, ఒంగోలు, అద్దంకి)
☞ మండలాలు: 28
☞ జనాభా: 17,67,633
☞ నియోజకవర్గాలు: 6 (ఒంగోలు, SNపాడు, దర్శి, అద్దంకి, కందుకూరు, కొండపి)
☞ కనిగిరి మార్కాపురంలోకి వెళ్లడంతో అందులోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కందుకూరు డివిజన్‌లోకి మార్చారు. వీటితోపాటు కొత్తగా అద్దంకి డివిజన్ ఏర్పడనుంది.
News December 30, 2025
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కు పాదం మోపాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా సోమవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వాగులు, ఇతర వనరుల్లో లభ్యమయ్యే ఇసుకను కేవలం 500 మీటర్ల పరిధిలోని గ్రామస్తులు మాత్రమే వినియోగించుకునేలా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందన్న విషయాన్ని గమనించాలన్నారు.