News June 6, 2024

జగన్, CBN, పవన్‌ను మించిన మెజార్టీ

image

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పిఠాపురంలో 70,279 ఓట్ల మెజార్టీ సాధించారు. YCP అధినేత జగన్ పులివెందులలో 61,687 ఓట్ల తేడాతో, TDP అధినేత CBN కుప్పంలో 48,006 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే రాష్ట్రంలో టాప్‌లో P.శ్రీనివాసరావు (95,235 ఓట్ల మెజారిటీ) ఉన్నారు. ఆ తర్వాత G.శ్రీనివాసరావు, N.లోకేశ్, P.రమేశ్, పి.నారాయణ, A.రాధాకృష్ణ, P.వెంకటేశ్వరరావు, A.శ్రీనివాస్, V.రామకృష్ణ సైతం అత్యధిక <<13382293>>మెజారిటీ<<>> సాధించారు.

Similar News

News January 11, 2025

మస్క్ పిచ్చివాడవుతున్నారు: బయోగ్రఫీ రచయిత

image

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉండేకొద్దీ పిచ్చివాడవుతున్నారని ఆయన జీవిత కథ రాస్తున్న అబ్రామ్‌సన్ ఆరోపించారు. మస్క్ మానసిక ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘మస్క్‌కు పిచ్చి ఎక్కుతోందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆయన బయోగ్రాఫర్‌గా గడచిన రెండేళ్లుగా మస్క్ ఆన్‌లైన్ ప్రవర్తన నిశితంగా చూస్తున్నాను. భారీగా డ్రగ్స్ వాడకం, ఒత్తిడి కారణంగా ఎలాన్‌కు లోలోపల ఏదో తేడా చేసింది’ అని ట్వీట్ చేశారు.

News January 11, 2025

ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూర్‌కు ప్రధాని మోదీ

image

వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటించనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వెల్లడించారు. ఆ నెల 11, 12 తేదీల్లో జరిగే ఏఐ సదస్సులో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. కాగా గత ఏడాదిన్నరలో మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2023 జులైలో ఆయన అక్కడ పర్యటించారు. ఆ తర్వాత 2024 రిపబ్లిక్ వేడుకలకు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ విశిష్ఠ అతిథిగా భారత్‌కు వచ్చారు.

News January 11, 2025

జనవరి 11: చరిత్రలో ఈరోజు

image

* 1922: మధుమేహ బాధితులకు ఇన్సులిన్‌ అందుబాటులోకి వచ్చిన రోజు
* 1944: జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సోరెన్ జననం
* 1966: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం(ఫొటోలో)
* 1973: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు
* 2008: పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ మరణం