News June 6, 2024
ఆదిలాబాద్ ఎంపీకి మంత్రి పదవి వరించేనా..?

కేంద్రంలో మరోసారి NDA ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో రాష్ట్రం నుంచి మంత్రి పదవుల ఆశావహుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు గెలుపొందడంతో రాష్ట్రానికి ప్రాధాన్యం పెరిగింది. కాగా దేశంలో మెుత్తం 47 ఎస్టీ లోక్ సభ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంపీ గోడెంనగేశ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందా అనే దానిపై చర్చ మెుదలైంది.
Similar News
News January 15, 2026
సీఎం పర్యటన.. ఏర్పాట్ల పరిశీలన

భోరజ్ మండలం చనాక కొరాట వద్ద ఏర్పాటు చేసిన పంప్ హౌస్‌ను రేపు ప్రారంభించేందుకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని, ఆ మేరకు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఎస్పీ, కలెక్టర్ ఆదేశించారు.
News January 15, 2026
ఉట్నూర్: గిరిజన ఉద్యాన కేంద్రంలో తీరొక్క మొక్కలు

ఉట్నూర్ మండల కేంద్రంలో ఉన్న ఐటీడీఏ ప్రాంగణ ప్రాంతంలోని గిరిజన ఉద్యాన కేంద్రంలో అనేక రకాల మామిడి మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలను విక్రయిస్తున్నారు. ఇది ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడ అలంకరణ మొక్కలు, గిఫ్ట్ మొక్కలు బయటి కేంద్రంలో కంటే తక్కువ ధరలోనే దొరుకుతాయి. ఉట్నూర్ మండల ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
News January 14, 2026
ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


