News June 6, 2024
AP& TGలో నోటా ఓట్ల సంఖ్య ఎంతంటే?

దేశవ్యాప్తంగా వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 63,72,220 ఓట్లు నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ)కు వచ్చినట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో అత్యధికంగా బిహార్‌లో 8,97,323 ఓట్లు నమోదయ్యాయి. ఇందులో తెలంగాణలోని 17 స్థానాల్లో మొత్తం 1,02,654 మంది ఓటర్లు (0.47% మంది) నోటాకు జై కొట్టారు. ఇక ఏపీలో నోటా ఓట్ల సంఖ్య 3,98,777. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటాను ఎంచుకుంటారు.
Similar News
News October 25, 2025
నాగ దేవతను పూజిస్తే కలిగే ఫలితాలు

నాగుల చవితి రోజున నాగ దేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. సర్వ రోగాలు తొలగిపోయి, సౌభాగ్యవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు. అన్ని రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని అంటున్నారు. సంతానం లేని దంపతులకు నాగ దేవత అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆరోగ్యకర జీవితం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. నేడు నాగ దేవతను పూజించి, నైవేద్యాలు సమర్పిస్తే అదృష్టం వెన్నంటే ఉంటుందని ప్రగాఢ విశ్వాసం.
News October 25, 2025
CIAను బురిడీ కొట్టించి ఆడవేషంలో తప్పించుకున్న లాడెన్!

అల్‌ఖైదా అధినేత లాడెన్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని CIA మాజీ అధికారి జాన్ కిరాయకో వెల్లడించారు. ‘2001లో 9/11 దాడి తర్వాత అఫ్గాన్‌లో అల్‌ఖైదా స్థావరాన్ని చుట్టుముట్టాం. కానీ అల్‌ఖైదా వ్యక్తే అనువాదకుడిగా US మిలిటరీలో చేరాడని మాకు తెలియదు. పిల్లలు, మహిళల్ని పంపిస్తే లొంగిపోతామని ఉగ్రవాదులు చెప్తున్నారని అతడు ఆర్మీని ఒప్పించాడు. దీంతో అక్కడే ఉన్న లాడెన్ ఆడవేషంలో తప్పించుకున్నాడు’ అని తెలిపారు.
News October 25, 2025
ఒత్తయిన జుట్టు కోసం ఇలా చేయండి

ఒత్తయిన జుట్టు కోసం మహిళలు ఎన్నో ప్రొడక్టులు వాడుతుంటారు. అలాకాకుండా ఇంట్లో లభించే పదార్థాలతోనే జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ఒక కీరాని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో పెసరపిండి, శనగపిండి, మెంతి పొడి(ఒక్కో స్పూన్ చొప్పున) కలిపి మిక్సీలో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్ల వరకు పట్టించి 30ని. తర్వాత తల స్నానం చేయాలి. వారంలో ఓసారి ఈ ప్యాక్ ట్రై చేస్తే ఒత్తయిన జట్టు సాధ్యమవుతుంది.


