News June 6, 2024
పార్లమెంట్‌కి బాలయోగి తనయుడు
AP: అమలాపురం మాజీ MP, తొలి దళిత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీశ్ పార్లమెంట్ గడప తొక్కనున్నారు. అమలాపురం నుంచి ఆయన భారీ మెజార్టీతో నెగ్గారు. తన ప్రత్యర్థి రాపాక వరప్రసాద్(YCP)పై 3,42,196 ఓట్ల మెజార్టీ సాధించి విజయ దుందుభి మోగించారు. గత ఎన్నికల్లో ఆయన TDP తరఫున ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. బాలయోగి మరణానంతరం 2002లో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్ తల్లి విజయకుమారి అమలాపురం MPగా గెలిచారు.
Similar News
News November 28, 2024
భార్య గొడవపెట్టుకోవడం క్రూరత్వం కాదు.. విడాకులివ్వలేం: హైకోర్టు
దాంపత్యంలో గొడవలు సాధారణమని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. మనోవేదన చెందినా అకారణంగా భార్య పెట్టుకొనే గొడవ క్రూరత్వం కిందకు రాదని పేర్కొంది. దీని ఆధారంగా భర్తకు విడాకులు మంజూరు చేయలేమని Dr భగీశ్ కుమార్ VS రింకీ కేసులో వెల్లడించింది. 2015లో ఒత్తిడితో పెళ్లి చేసుకున్నానని, అప్పట్నుంచి ఆమె చేతిలో కష్టాలు, అవమానాలు, బ్లాక్‌మెయిలింగ్ ఎదుర్కొన్నానన్న భర్త ఆమెతో విడిపోవడానికి సరైన సాక్ష్యాలు చూపలేదంది.
News November 28, 2024
చిన్మయ్‌ను విడుదల చేయండి: షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు అక్రమమని, వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ఆ దేశ Ex PM షేక్ హసీనా డిమాండ్ చేశారు. ఆయన అరెస్టు అనంతరం జరిగిన అల్లర్లలో న్యాయవాది మృతి చెందడాన్ని ఖండించారు. ఆలయాలు, మసీదులపై దాడులు జరుగుతున్నా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మత స్వేచ్ఛ, ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
News November 28, 2024
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం శుభవార్త
TG: కాజీపేటలో ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక్కడ LHB, EMU కోచ్‌లు తయారీ చేసేందుకు వీలుంటుంది. కాగా కోచ్‌ల తయారీకి తగినట్లు సౌకర్యాలు అభివృద్ధి చేయాలని SCRకు ఆదేశాలిచ్చింది. ఈ నిర్ణయంతో కొత్తగా దాదాపు 2,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనా.