News June 6, 2024
చంద్రబాబుకు CM రేవంత్ రెడ్డి ఫోన్
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తుండటంపై అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల విభజన హామీలు, సమస్యలు పరిష్కరించుకుందామని CBNను కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. కాగా, ప్రమాణస్వీకారానికి చంద్రబాబు పిలిస్తే వెళ్తానని నిన్న రేవంత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 28, 2024
టెన్త్ పరీక్షల్లో ఇంటర్నల్స్ ఉండవు: ప్రభుత్వం
TG: టెన్త్ పరీక్షల మార్కుల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 100 మార్కులకు పరీక్షలు నిర్వహించనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇంటర్నల్స్‌కు 20 మార్కులు, రాత పరీక్షకు 80 మార్కులు ఇచ్చేవారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ఇంటర్నల్ మార్కులు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది.
News November 28, 2024
HIGH ALERT.. అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపు ఉదయానికి తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప్రకాశం, శ్రీసత్యసాయి, YSR జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. నవంబర్ 30న తుఫాన్ తీరం దాటనుంది.
News November 28, 2024
ఈగల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
AP: డ్రగ్స్ నియంత్రణకు <<14724446>>ఈగల్‌ను <<>>ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను నెలకొల్పనుంది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా, సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోవాలని ఆదేశించింది. అటు డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది.