News June 6, 2024
షర్మిల కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించారు: సుంకర పద్మశ్రీ
AP: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భ్రష్టు పట్టించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆరోపించారు. ‘పార్టీ నుంచి వచ్చిన ఫండ్స్ దాచుకున్నారు. పార్టీ అభ్యర్థులకు కనీసం జెండాలు కూడా అందించలేదు. కార్యకర్తలను, నేతలను ఆమె గాలికొదిలేశారు. రాహుల్ గాంధీని చూసి ఆమెను ఏమనలేకపోయాం. కక్షపూరిత చర్యల కోసమే ఆమె రాష్ట్రానికి వచ్చినట్లు కనిపిస్తోంది’ అని మండిపడ్డారు.
Similar News
News November 28, 2024
పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు!
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేసి 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అటు ఈ సారి ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులనే నిబంధనను ఎత్తివేయనుంది. అలాగే రిజర్వేషన్లలో మార్పులు, చేర్పులపై ప్రణాళికలు రచిస్తోంది.
News November 28, 2024
భార్య గొడవపెట్టుకోవడం క్రూరత్వం కాదు.. విడాకులివ్వలేం: హైకోర్టు
దాంపత్యంలో గొడవలు సాధారణమని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. మనోవేదన చెందినా అకారణంగా భార్య పెట్టుకొనే గొడవ క్రూరత్వం కిందకు రాదని పేర్కొంది. దీని ఆధారంగా భర్తకు విడాకులు మంజూరు చేయలేమని Dr భగీశ్ కుమార్ VS రింకీ కేసులో వెల్లడించింది. 2015లో ఒత్తిడితో పెళ్లి చేసుకున్నానని, అప్పట్నుంచి ఆమె చేతిలో కష్టాలు, అవమానాలు, బ్లాక్‌మెయిలింగ్ ఎదుర్కొన్నానన్న భర్త ఆమెతో విడిపోవడానికి సరైన సాక్ష్యాలు చూపలేదంది.
News November 28, 2024
చిన్మయ్‌ను విడుదల చేయండి: షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు అక్రమమని, వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ఆ దేశ Ex PM షేక్ హసీనా డిమాండ్ చేశారు. ఆయన అరెస్టు అనంతరం జరిగిన అల్లర్లలో న్యాయవాది మృతి చెందడాన్ని ఖండించారు. ఆలయాలు, మసీదులపై దాడులు జరుగుతున్నా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మత స్వేచ్ఛ, ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.