News June 6, 2024
ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ నేత ఆవేదన

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాబోయే కాలమంతా తనకు గడ్డు కాలమేనని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తప్ప ఇతర విషయాల్లో తనకు అవగాహన లేదని మీడియాతో చెప్పారు. కుటుంబ భవిష్యత్తు కోసం ఎలాంటి ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకోలేదని, కష్టాలను ఎలా అధిగమించాలో తెలియడం లేదన్నారు. కాగా బెంగాల్‌లోని బర్హంపూర్ నియోజకవర్గంలో టీఎంసీ నేత యూసుఫ్ పఠాన్ చేతిలో అధీర్ ఓడిపోయారు.
Similar News
News September 15, 2025
నాగమల్లయ్య హత్యపై స్పందించిన ట్రంప్

అమెరికాలో భారతీయుడి <<17690207>>తల నరికివేసిన<<>> ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘క్యూబాకు చెందిన అక్రమ వలసదారు భార్యాబిడ్డల ముందే చంద్ర నాగమల్లయ్యను కిరాతకంగా చంపేశాడు. అతడు గతంలో నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు. అతడిని క్యూబా తమ దేశంలోకి తీసుకునేందుకు నిరాకరించింది. బైడెన్ అసమర్థతతో జైలు నుంచి బయటకు వచ్చాడు. నేరస్థుడిని కఠినంగా శిక్షిస్తాం. అక్రమ వలసదారులను వదలం’ అని హెచ్చరించారు.
News September 15, 2025
స్పీకర్‌కు అభ్యంతరాలు తెలపనున్న BRS నేతలు

TG: పార్టీ ఫిరాయింపుల నోటీసులకు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై అభ్యంతరాలు తెలిపేందుకు బీఆర్ఎస్ నేతలు ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలవనున్నారు. ఎమ్మెల్యేల వివరణపై అభ్యంతరాలుంటే మూడ్రోజుల్లోగా తెలపాలని సూచించిన విషయం తెలిసిందే. వాటిని పరిశీలించిన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇవాళ మరిన్ని ఆధారాలు సమర్పించాలని నిర్ణయించింది. నోటీసులు అందుకున్న MLAల్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్ వివరణ అందజేయాల్సి ఉంది.
News September 15, 2025
ఆర్బీఐలో 120 పోస్టులు

<