News June 6, 2024
కడప: ఐటీఐలో ప్రవేశాలకు జూన్ 10 తుది గడువు

కడప జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజ్‌ల్లో ప్రవేశానికి జూన్ 10వ తేదీ తుది గడువని కడప ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ ప్రిన్సిపల్, కన్వీనర్ ఎం.జ్ఞాన కుమార్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను iti.ap.gov.in వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పాస్/ ఫెయిల్ అయిన అభ్యర్థులు ప్రవేశాలకు అర్హులన్నారు. అభ్యర్థులు తమకు సమీపంలో ఉన్న ఐటీఐల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు.
Similar News
News January 11, 2026
IMH కడపలో 53 పోస్టులకు నోటిఫికేషన్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్(IMH), కడపలో 53 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు జనవరి 5 నుంచి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ITI, ఇంటర్, డిప్లొమా(ఆక్యుపేషనల్ థెరపీ, ECG, అనస్థీషియా, యోగా), BA, BSc, MSW, DMLT, MLT, MA(సైకాలజీ), PG డిప్లొమా ,M.Phil ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in
News January 11, 2026
గండికోట ఉత్సవాలకు ఎన్ని రూ.కోట్లంటే.!

గండికోట ఉత్సవాలు 6 ఏళ్ల తర్వాత జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాలతో పర్యాటకులను అలరించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. గండికోట చారిత్రక నేపథ్యాన్ని తెలిపే వీడియోలను సిద్ధం చేశారు. ఈ ఉత్సవాలకు ప్రభుత్వం రూ.3 కోట్లను విడుదల చేసింది.
News January 11, 2026
గండికోటకు వెళ్లాలంటే మార్గాలు ఇవే..!

గండికోటలో 11 నుంచి 13వ తేదీ వరకు ‘గండికోట ఉత్సవాలు’ జరుగుతున్నాయి. ఇక్కడికి చేరుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి.
➤ రోడ్డు మార్గం: జమ్మలమడుగు నుంచి రోడ్డు మార్గం ఉంది (17 KM)
➤ రైలు మార్గం: జమ్మలమడుగు స్టేషన్ నుంచి 18 KM, ముద్దనూరు స్టేషన్ నుంచి 25KM ఉంటుంది. స్టేషన్ల నుంచి రోడ్డు మార్గాన చేరుకోవచ్చు.
➤ విమాన మార్గం: కడపలో విమానాశ్రయం ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన గండికోటకు చేరుకోవచ్చు.


