News June 6, 2024
మోదీ మ్యాజిక్ పనిచేయలేదు(2/2)

ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ తమిళనాడుపై ఫోకస్ చేశారు. 6 నెలల్లోనే 10సార్లు పర్యటించారు. కానీ ఒక్క సీటూ దక్కలేదు. కేరళలోనూ ఇదే పరిస్థితి. ఆయన ప్రచారం చేసిన చోట BJP నేతలకు ఓటమే ఎదురైంది. గెలిచిన త్రిస్సూర్‌లో ఆయన ప్రచారం చేయకపోవడం గమనార్హం. UP, మహారాష్ట్రలోనూ BJP పరిస్థితి దిగజారింది. ఆఖరికి అయోధ్యలోనూ <<13388928>>ఓటమి<<>> తప్పలేదు. మోదీ పోటీ చేసిన వారణాసిలోనూ మెజార్టీ 3 లక్షలకు పైగా తగ్గిపోయింది.
Similar News
News September 10, 2025
దసరా సెలవుల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి

AP: దసరా సెలవుల్లో మార్పులు చేయాలని ప్రభుత్వానికి MLC గోపిమూర్తి విజ్ఞప్తి చేశారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూళ్లకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉన్నాయి. అయితే పండుగ ఈ నెల 22 నుంచే మొదలవుతుందని, ఈ నేపథ్యంలో ఆ తేదీ నుంచే సెలవులు ఇవ్వాలని కోరారు. DSC నియామకాలకు ముందే అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లను పూర్తి చేయాలన్నారు.
News September 10, 2025
హైకోర్టు తీర్పును సవాల్ చేసే యోచనలో TGPSC?

TG: గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు ఇచ్చిన <<17655670>>తీర్పును<<>> డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని TGPSC యోచిస్తున్నట్లు సమాచారం. నిన్న కమిషన్ ఛైర్మన్ బుర్ర వెంకటేశం, సభ్యులు దీనిపై సమావేశమై చర్చించారు. మళ్లీ మూల్యాంకనం జరిపితే అనేక సమస్యలు వస్తాయని కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ పెద్దలతోనూ చర్చించి ఇవాళ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
News September 10, 2025
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.