News June 6, 2024

ఎన్నికైన 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు: ADR

image

ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. అందులో 170 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు(అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దాడులు) ఉన్నాయంది. అలాగే మొత్తం 543 మంది ఎంపీలనుగాను 504(93 శాతం) మంది కోటీశ్వరులని పేర్కొంది. ఎన్నికైన మొత్తం ఎంపీల సగటు ఆస్తి రూ.46.34 కోట్లని తెలిపింది.

Similar News

News November 28, 2024

కొండా సురేఖపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

image

TG: మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సురేఖపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆమెకు సమన్లు జారీ చేసింది. కాగా తన పరువుకు భంగం కలిగించేలా అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

News November 28, 2024

మా త‌దుప‌రి ల‌క్ష్యం అదే: అజిత్ ప‌వార్‌

image

గ‌తంలో జాతీయ హోదా కలిగిన NCPని తిరిగి ఆ స్థాయికి తీసుకురావ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని పార్టీ చీఫ్ అజిత్ ప‌వార్ పేర్కొన్నారు. కొత్త త‌రాన్ని ముందుకు తీసుకువ‌స్తామ‌ని, అందులోనూ మ‌హిళ‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. Decలో పార్టీ జాతీయ స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. 3 స్టేట్స్‌లో రాష్ట్ర పార్టీగా ఉన్నామని, రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయనున్నట్టు NCP MP ప్ర‌ఫుల్ ప‌టేల్ తెలిపారు.

News November 28, 2024

ఆ దేశం నుంచి భారతీయులను అడ్డుకోవడమే ట్రంప్ లక్ష్యం?

image

USలోకి అక్రమ వలసలను నివారించే వరకు మెక్సికో, కెన‌డా దేశాలపై ట్రంప్ ప‌న్నుల మోత మోగించనున్నారు. ముఖ్యంగా కెన‌డా నుంచి వ‌ల‌స‌లు అధిక‌మ‌వుతున్నాయ‌ని, అందులోనూ భార‌తీయులు అత్య‌ధికంగా ఉన్న‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. గ‌త ఏడాది గంట‌కు 10 మంది భార‌తీయులు యూఎస్‌లోకి ప్ర‌వేశించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. కెన‌డా నుంచి USలోకి వెళ్లే అక్రమ వలసదారుల్లో 60% భార‌తీయులే ఉండడం గమనార్హం.