News June 6, 2024
తణుకులో సైకిల్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

ప.గో జిల్లా తణుకు మండలం తేతలి హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తణుకు రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు(59) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం సైకిల్‌పై తణుకు వైపు వస్తుండగా లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన వెంకటేశ్వరరావును చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందాడు.
Similar News
News January 17, 2026
భీమవరం: యువ హీరో సిద్ధు జొన్నలగడ్డకు ‘సోగ్గాడు’ పురస్కారం

నటభూషణ్ శోభన్ బాబు 90వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నుంచి యువ హీరోలకు అందించనున్న ‘సోగ్గాడు’ అవార్డుకు సిద్ధు జొన్నలగడ్డను ఎంపిక చేసినట్లు ప్రతినిధి భట్టిప్రోలు శ్రీనివాసరావు తెలిపారు. త్వరలో శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జరగనున్న వేడుకలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. వెండితెరపై ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించే గ్లామర్ హీరోలకు ఈ గౌరవం దక్కనుంది.
News January 17, 2026
ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు: కలెక్టర్

జిల్లాలోని అన్ని గ్రామాలలో ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహణ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జనవరి 19 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పశుపోషకులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ నిర్వహించి, పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.
News January 16, 2026
భీమవరంలో రైల్వే ట్రాక్‌పై బాలిక మృతదేహం కలకలం

భీమవరం-ఉండి రహదారిలోని రైల్వే గేటు సమీపంలో ట్రాక్‌పై శుక్రవారం ఓ గుర్తు తెలియని బాలిక(3) మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. రైల్వే ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఏదైనా గుర్తు తెలియని రైలు ఢీకొనడం వల్లే ఆ చిన్నారి మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతి చెందిన బాలిక గురించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే వెంటనే భీమవరం రైల్వే గవర్నమెంట్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.


