News June 6, 2024
హింసాత్మక ఘటనలపై పవన్ స్పందించాలి: బాలినేని

AP: ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి Xలో శుభాకాంక్షలు తెలిపారు. ‘హింసాత్మక ఘటనలకు తావులేదని నిన్న మీరిచ్చిన సందేశం హర్షణీయం. మీ వ్యాఖ్యలకు భిన్నంగా, ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింస, భౌతిక దాడులు, వేధింపులపై మీరు స్పందించాలి. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు’ అని రాసుకొచ్చారు.
Similar News
News November 5, 2025
బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతో అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్నట్లవుతుంది. సున్నితమైన విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవితం మీకు తెలీకుండానే చేజారే అవకాశం ఉంది. బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
News November 5, 2025
ఎక్కువ సేపు కూర్చుంటే ‘థ్రాంబోసిస్’ వ్యాధి

4-6 గంటలు ఒకేచోట కూర్చుని పనిచేసే వాళ్లలో రక్తం గడ్డకట్టే(థ్రాంబోసిస్) వ్యాధి పెరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఆధునిక జీవనశైలి, ఎక్కువదూరం ఫ్లైట్ జర్నీలు, ఆస్పత్రుల్లో అధిక సమయం గడపడం వల్ల ఈ రిస్క్ ఉంటుందని వెల్లడైంది. ‘ఇలాంటివారి కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డ కడుతుంది. దీంతో తీవ్రమైన నొప్పితో బాధపడతారు. దీన్ని మొదట్లోనే నియంత్రించకపోతే ఊపిరితిత్తులు, గుండెకూ సమస్య రావొచ్చు’ అని తేలింది.
News November 5, 2025
‘థ్రాంబోసిస్’ వ్యాధిని నివారించాలంటే?

* డెస్క్, ఆస్పత్రుల్లో ఎక్కువ గంటలు గడపాల్సి ఉంటే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
* కూర్చున్న చోటే లెగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. వీలుంటే తక్కువ దూరాలైనా నడవాలి.
* ఫ్లైట్, ట్రైన్, బస్సు లాంగ్ జర్నీలలో కనీసం గంటకోసారైనా లేచి నడవాలి. దీనివల్ల కాళ్లలో రక్తసరఫరా మెరుగుపడుతుంది.
* కాళ్ల నొప్పులు ఉంటే ఫిజియోథెరపీ చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలి.


