News June 6, 2024
ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఓటమే!
AP: కాకినాడ జిల్లాకు చెందిన చలమలశెట్టి సునీల్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతూనే ఉంది. 2009 నుంచి ఇదే తంతు జరుగుతోంది. సునీల్ 2009లో PRP తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడారు. 2014లో YCP తరఫున, 2019లో TDP తరఫున, 2024లో YCP తరఫున MPగా పోటీ చేయగా ఆయన ఓడిపోయారు. అలాగే ఆయన ప్రాతినిథ్యం వహించిన పార్టీలు కూడా ఓడాయి. దీంతో ఆయన ప్రతీసారి ఓడిపోబోయే పార్టీలోకే వెళ్తారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News November 29, 2024
పసిపిల్లలకు చలి వేస్తే దుప్పట్లు కప్పొచ్చా?
జ్వరాలు వచ్చిన పసిపిల్లలకు దుప్పట్లు కప్పడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మందంగా ఉన్ని దుప్పటి అసలే కప్పవద్దని హెచ్చరిస్తున్నారు. జ్వరం వచ్చినప్పుడు శరీరం వేడెక్కుతుందని, అప్పుడు దుప్పట్లు కప్పితే లోపల ఉష్ణోగ్రత మరింత పెరుగుతుందంటున్నారు. చలి ఎక్కువగా ఉన్నట్లయితే పలచటి కాటన్ దుప్పట్లు కాసేపు కప్పవచ్చని, వణకు తగ్గగానే అది కూడా తీసేయాలంటున్నారు.
News November 29, 2024
అన్ని ఆయుధాలు ప్రయోగిస్తాం జాగ్రత్త.. ఉక్రెయిన్‌కు పుతిన్ హెచ్చరిక
అణ్వాయుధాలను ఉక్రెయిన్ సమకూర్చుకున్నట్టైతే కీవ్‌లోని కీలక ప్రభుత్వ కార్యాలయాలపై తమ వద్ద ఉన్న అన్ని రకాల ఆయుధాలను ప్రయోగిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిచారు. ఓరేష్నిక్ హైపర్‌సోనిక్ క్షిపణులతో కీవ్‌లోని నిర్ణయాత్మక కేంద్రాలే లక్ష్యంగా దాడి చేస్తామన్నారు. గత 33 నెలల యుద్ధ కాలంలో ఉక్రెయిన్ పార్లమెంటు, అధ్యక్ష కార్యాలయం, మంత్రిత్వ శాఖలపై రష్యా దాడి చేయలేదు.
News November 29, 2024
PIC OF THE DAY: ప్రధానితో క్రికెటర్లు
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో టీమ్ ఇండియా క్రికెటర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాన్‌బెర్రా పార్లమెంట్ వద్ద ప్రధానితో భారత ఆటగాళ్లు గ్రూప్ ఫొటో తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఎల్లుండి నుంచి ప్రైమ్ మినిస్టర్ XIతో భారత్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు జరగనుంది.