News June 7, 2024

ఉక్రెయిన్‌కు రావాలని మోదీని ఆహ్వానించా: జెలెన్ స్కీ

image

స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌లో జరిగే శాంతి సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోదీని కోరినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్విటర్‌లో తెలిపారు. ఈ సమావేశంలో భారత్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. అవకాశం ఉంటే ఉక్రెయిన్‌ను సందర్శించాలని ఆహ్వానించినట్లు వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లో ఈ నెల 15-16న శాంతి సదస్సు నిర్వహిస్తున్నారు.

Similar News

News November 29, 2024

తెలుగు టైటాన్స్ విజయం

image

ప్రో కబడ్డీ లీగ్‌లో యూ ముంబాతో జరిగిన మ్యాచులో తెలుగు టైటాన్స్ 41-35 పాయింట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. TTలో ఆశిష్, విజయ్ చెరో 10 పాయింట్లు సాధించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్(48) రెండో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో హరియాణా స్టీలర్స్(56) కొనసాగుతోంది.

News November 29, 2024

నిద్ర రాకముందే బెడ్రూంలోకి వెళ్తున్నారా?

image

చాలామంది నిద్రరాకముందే బెడ్రూంలోకి వెళ్లి బలవంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా చేస్తే ఒత్తిడి పెరిగి నిద్ర రావడం మరింత ఆలస్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే నిద్ర వచ్చే వరకు న్యూస్ పేపర్, బుక్స్ చదవడం చేయాలంటున్నారు. నిద్ర వచ్చినప్పుడే బెడ్రూంలోకి వెళ్లాలని సూచిస్తున్నారు. త్వరగా నిద్రపట్టేందుకు సా.4 తర్వాత టీ, కాఫీ దూరంపెట్టాలంటున్నారు. డైలీ అరటిపండ్లు తినాలని చెబుతున్నారు.

News November 29, 2024

16 ఏళ్లలోపు పిల్లలకు ఇవి నిషేధం.. చట్టాన్ని ఆమోదించిన ఆస్ట్రేలియా

image

16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తూ తెచ్చిన చ‌ట్టాన్ని ఆస్ట్రేలియా గురువారం ఆమోదించింది. అన్ని టెక్ దిగ్గ‌జాల‌ను దీని ప‌రిధిలోకి తెచ్చింది. ఇన్‌స్టాగ్రామ్, మెటా, టిక్‌టాక్‌ వంటి సంస్థలు ఇక నుంచి మైన‌ర్ల లాగిన్‌ను నిలిపివేయాలి. లేదంటే రూ.410 కోట్ల జ‌రిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని జ‌న‌వ‌రిలో పైలెట్ ప్రాజెక్టుగా అమ‌లు చేసి ఏడాది కాలంలో పూర్తిస్థాయిలో అమ‌లు చేస్తారు.