News June 7, 2024
RBI మానిటరీ పాలసీపై ఇన్వెస్టర్ల ఫోకస్!

ఎన్నికల ఫలితాలతో ఒడుదొడుకులకు గురై మళ్లీ మార్కెట్లు కోలుకుంటున్న వేళ ఇన్వెస్టర్ల దృష్టి ఇప్పుడు RBI మీద పడింది. మానిటరీ పాలసీ నిర్ణయాలను ఈరోజు RBI వెల్లడించనుండటమే ఇందుకు కారణం. ద్రవ్యోల్బణం తగ్గి, GDP వృద్ధిపై RBI అంచనా పెంచితే అది తమకు సానుకూలంగా మారొచ్చని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఇక వడ్డీ రేట్లను మరోసారి RBI 6.5శాతానికి పరిమితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News November 1, 2025
కేశినేని చిన్ని VS కొలికపూడి.. చంద్రబాబు ఆగ్రహం

AP: MP కేశినేని చిన్ని, MLA కొలికపూడి మధ్య <<18088401>>విభేదాలపై<<>> CM CBN మండిపడ్డారు. వారి నుంచి వివరణ తీసుకుని తనకు నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. ‘పార్టీ నేతలు ఇలా ఆరోపణలు చేసుకోవడం ఎప్పుడూ జరగలేదు. పార్టీ టికెట్ ఇస్తేనే గెలిచామని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ సిద్ధాంతాల గురించి తెలియని వారికి, పొలిటికల్ అనుభవం లేని వారికి టికెట్లిచ్చి తొందరపడ్డానేమో’ అని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు.
News November 1, 2025
APPLY NOW: ముంబై పోర్ట్ అథారిటీలో 116 పోస్టులు

ముంబై పోర్ట్ అథారిటీ 116 కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్, బీఈ, బీకామ్, బీఏ, బీఎస్సీ, బీసీఏ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100. www.apprenticeshipindia.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in/
News November 1, 2025
ఇతిహాసాలు క్విజ్ – 53

1. జ్యోతిర్లింగం మొదలు, తుది తెలుసుకోలేని దేవతలు ఎవరు?
2. తారకాసురుని సంహరించింది ఎవరు?
3. దక్ష యజ్ఞాన్ని నాశనం చేసిన శివుడి ఉగ్ర రూపం పేరు?
4. శ్రీకృష్ణుడికి బాణం వేసిన వేటగాడి పేరు?
5. పంచభూత స్థలాల్లో భూమి(పృథ్వీ) లింగం ఎక్కడ ఉంది?
☛ సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
Ithihasaluquiz


