News June 7, 2024

చిత్తూరు: పెద్దిరెడ్డితో కమిటీ ఏర్పాటు

image

దాడుల నుంచి కాపాడి కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైసీపీ కేంద్ర కార్యాలయం కమిటీలను ఏర్పాటు చేసింది. చిత్తూరు పార్లమెంటు పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భరత్, ఆర్కే రోజా, సునీల్ కుమార్, వెంకటేగౌడ, రెడ్డెప్ప, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కృపాలక్ష్మి, విజయానందరెడ్డిని కమిటీలో నియమించింది. జిల్లాలో ఎక్కడైనా దాడులు జరిగితే కమిటీ సభ్యులు బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా ఉంటారు.

Similar News

News September 29, 2024

చిత్తూరు సబ్ జైల్లో భద్రతపై సమీక్ష

image

చిత్తూరు సబ్ జైలులో భద్రత ఏర్పాట్లపై ఎస్పీ మణికంఠ సమీక్ష నిర్వహించారు. భద్రత, ఖైదీల హక్కులు, జైలు సిబ్బంది పనితీరును ఆయన సమీక్షించారు. ఖైదీలకు సురక్షితమైన, నైతిక పరిరక్షణను కల్పించడంలో జైలు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గార్డులు, సిబ్బంది విధి నిర్వహణలో మరింత శ్రద్ధ చూపాలని తెలిపారు. ఖైదీలలో పరివర్తనకు కృషి చేయాలన్నారు.

News September 28, 2024

మొగిలి ఘాట్ వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్

image

మొగిలి ఘాట్ నందు ప్రమాదాల నివారణకు చేపట్టే చర్యలను వచ్చే వారంలోపు పూర్తి చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ జాతీయ రహదారులు మరియు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ.. మొగిలి ఘాట్ వద్ద చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేసి ఒక అంబులెన్స్, క్రేన్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. హోర్డింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

News September 28, 2024

నేడు తిరుపతికి సిట్ బృందం రాక

image

తిరుమల లడ్డూ కల్తీ అంశం రాష్ట్రంలో దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై విచారణ చేపట్టడానికి ప్రభుత్వం నియమించిన సిట్ బృందం నేడు తిరుపతికి రానుంది. ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలోని ఈ బృందం లడ్డూ కల్తీపై ముమ్మరంగా దర్యాప్తు చేపట్టనుంది. ఇందులో భాగంగా సిట్ బృందం మొదటి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో నమోదయిన కేసును తమ పరిధిలోకి తీసుకోనుంది.