News June 7, 2024
19 వేల మంది టీచర్లకు పదోన్నతులు!

TG: రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన షెడ్యూల్ నేడో, రేపో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు చూసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. ఈ ప్రక్రియ పూర్తయితే 10,449 మందికి SAలుగా, 778 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 6 వేలమంది ఎస్‌జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు.
Similar News
News September 10, 2025
హైకోర్టు తీర్పును సవాల్ చేసే యోచనలో TGPSC?

TG: గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు ఇచ్చిన <<17655670>>తీర్పును<<>> డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయాలని TGPSC యోచిస్తున్నట్లు సమాచారం. నిన్న కమిషన్ ఛైర్మన్ బుర్ర వెంకటేశం, సభ్యులు దీనిపై సమావేశమై చర్చించారు. మళ్లీ మూల్యాంకనం జరిపితే అనేక సమస్యలు వస్తాయని కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ పెద్దలతోనూ చర్చించి ఇవాళ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
News September 10, 2025
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
News September 10, 2025
మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: ట్రంప్

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ‘వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి ఇరు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. రాబోయే వారాల్లో నా మంచి మిత్రుడు, ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా. ట్రేడ్ విషయంలో రెండు గొప్ప దేశాలు సక్సెస్‌ఫుల్ కన్‌క్లూజన్‌కు రావడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నా’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.