News June 7, 2024
నిర్మల్: పిడుగు పడి బాలుడు మృతి

పిడుగు పడి బాలుడు మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఎల్వత్ గ్రామానికి చెందిన మగీర్వాడ్ శ్రీ (10) గురువారం పిడుగు పాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. శ్రీ ఉదయం మేకలు మేపడానికి వెళ్లాడు. మద్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగు పడటంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. తండ్రి సాయినాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News January 15, 2026
సీఎం పర్యటన.. ఏర్పాట్ల పరిశీలన

భోరజ్ మండలం చనాక కొరాట వద్ద ఏర్పాటు చేసిన పంప్ హౌస్‌ను రేపు ప్రారంభించేందుకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని, ఆ మేరకు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఎస్పీ, కలెక్టర్ ఆదేశించారు.
News January 15, 2026
ఉట్నూర్: గిరిజన ఉద్యాన కేంద్రంలో తీరొక్క మొక్కలు

ఉట్నూర్ మండల కేంద్రంలో ఉన్న ఐటీడీఏ ప్రాంగణ ప్రాంతంలోని గిరిజన ఉద్యాన కేంద్రంలో అనేక రకాల మామిడి మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలను విక్రయిస్తున్నారు. ఇది ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడ అలంకరణ మొక్కలు, గిఫ్ట్ మొక్కలు బయటి కేంద్రంలో కంటే తక్కువ ధరలోనే దొరుకుతాయి. ఉట్నూర్ మండల ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
News January 14, 2026
ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


