News June 7, 2024

ఏపీ సీఎస్‌గా నీరభ్ కుమార్?

image

AP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ పేరు <<13390605>>తెరపైకి<<>> వచ్చింది. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబును నీరభ్ కుమార్ నిన్న మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. ఆయన నియామకంపై ఇవాళ జీవో రావొచ్చనే చర్చ నడుస్తోంది. ప్రస్తుత CS జవహర్ రెడ్డి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు.

Similar News

News September 10, 2025

మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా: ట్రంప్

image

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ‘వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి ఇరు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. రాబోయే వారాల్లో నా మంచి మిత్రుడు, ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా. ట్రేడ్ విషయంలో రెండు గొప్ప దేశాలు సక్సెస్‌ఫుల్ కన్‌క్లూజన్‌కు రావడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నా’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

News September 10, 2025

‘ఇందిరమ్మ ఇళ్ల’ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. HYD హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్‌ను ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. 18005995991 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లబ్ధిదారులు, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారు.

News September 10, 2025

టీ20 WC-2026 షెడ్యూల్ ఖరారు?

image

వచ్చే ఏడాది భారత్, శ్రీలంక హోస్ట్ చేయనున్న ICC మెన్స్ T20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనున్నట్లు ESPNCricinfo పేర్కొంది. 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో మొత్తం 55 మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 5 వేదికల్లో (భారత్‌లో 3, శ్రీలంక లో 2) నిర్వహించనున్నారు. పాకిస్థాన్ క్వాలిఫికేషన్‌ను బట్టి ఫైనల్‌ను అహ్మదాబాద్ లేదా కొలొంబోలో నిర్వహిస్తారని సమాచారం.