News June 7, 2024

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎవరు?

image

AP అసెంబ్లీ స్పీకర్‌గా ఎవరు నియమితులవుతారనే దానిపై చర్చ మొదలైంది. ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన కనుమూరి రఘురామకృష్ణ రాజు తనకు ఈ పదవి కావాలని TDP అధినేత చంద్రబాబును కోరుతున్నట్లు తెలుస్తోంది. అటు నెల్లూరు(D) ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి, చీపురుపల్లి నుంచి గెలిచిన కళా వెంకట్రావు పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. CMగా CBN ప్రమాణ స్వీకారం అనంతరం దీనిపై స్పష్టత రానుంది.

Similar News

News December 28, 2025

తిరుమల భక్తులకు అలర్ట్

image

తిరుమలలో ఎల్లుండి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలను TTD ప్రారంభించనుంది. ఈ క్రమంలో నేటి నుంచి Jan 7 వరకు SSD టోకెన్ల జారీని రద్దు చేసింది. ఈ తేదీల్లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు ఇవ్వరు. ఈనెల 30, 31, Jan 1 తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. టోకెన్లు లేనివారిని Jan 2 నుంచి 8 వరకు సర్వదర్శనం క్యూలైన్‌లో అనుమతిస్తారు.

News December 28, 2025

APలో ప్రముఖ ‘ఉత్తర ద్వార’ క్షేత్రాలివే!

image

కదిరి లక్ష్మీనరసింహస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, మంగళగిరి పానకాల నరసింహస్వామి, అహోబిలం, ద్వారకా తిరుమల, సింహాచల పుణ్యక్షేత్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఏటా అత్యంత వైభవంగా జరుగుతాయి. వీటితో పాటు విజయవాడలోని రాఘవేంద్ర స్వామి మఠం, నెల్లూరు రంగనాయకుల స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, శ్రీకాకుళంలోని శ్రీకూర్మం క్షేత్రాల్లోనూ గతంలో ఉత్తర ద్వార దర్శనాలు కల్పించారు.

News December 28, 2025

CAT: 99 పర్సెంటైల్ వచ్చినా సీటు కష్టమే!

image

IIMలలో ప్రవేశాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రవేశ పరీక్ష CATలో అసాధారణ ప్రతిభ కనబర్చాలి. కానీ ఇటీవల CATలో టాపర్లు పెరిగిపోతుండటంతో 99% పైగా పర్సెంటైల్ వచ్చినా సీట్లు రావడం లేదు. సీట్ల సంఖ్య తక్కువగా ఉండటం, టాపర్లు ఎక్కువగా ఉండటమే కారణం. CAT 2025లో 12 మందికి 100% మార్కులు, 26 మందికి 99.99, 26 మందికి 99.98% మార్కులు వచ్చాయి. ఒకప్పుడు 99.30% వస్తే సీటు దక్కేది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడం గమనార్హం.