News June 7, 2024

జగన్‌తో తిరుపతి ఎంపీ భేటీ

image

వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తిరుపతి ఎంపీగా గెలిచిన మద్దిల గురుమూర్తి గురువారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ ఓటమికి గల కారణాలను ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని జగన్, గురుమూర్తికి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Similar News

News December 28, 2025

STలకు రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు: DSO

image

జిల్లా వ్యాప్తంగా రేషన్, గ్యాస్ కనెక్షన్ లేని ఎస్టీలు వందల సంఖ్యలో ఉన్నారని, వారికి త్వరలోనే కార్డులు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను డీఎస్ఓ లీలారాణి ఆదేశించారు. ఇటీవల సంభవించిన తుఫాన్ ధాటికి అధిక సంఖ్యలో ఎస్టీలు దెబ్బతిన్నారన్నారు. వారికి నిత్యవసర సరకులు పంపిణీ చేసే క్రమంలో రేషన్ కార్డు లేకపోవడం గుర్తించామన్నారు.

News December 28, 2025

పెంచలకోనపై వీడని పీటముడి.. అటా.. ఇటా?

image

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుంది నెల్లూరు జిల్లా పరిస్థితి. గూడూరును నెల్లూరులో కలపడానికే CM సానుకూలత వ్యక్తం చేశారట. వెంకటగిరి నియోజకవర్గంలోని మండలాలపై మాత్రం పీటముడి వీడటం లేదు. కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరులో కలపాలన్న గట్టి డిమాండ్ ఉంది. కలువాయి(M)న్ని నెల్లూరులో, సైదాపురం, రాపూరు(M)న్ని మాత్రం తిరుపతిలోనే ఉంచనున్నారట. దీంతో పెంచలకోన తిరుపతిలోనే ఉండనుంది.

News December 28, 2025

నెల్లూరు: మాటల్లేవ్.. నిశ్శబ్ద యుద్ధమే..!

image

అక్కడ పగలు, ప్రతీకారాలు లేవు. పార్టీ ఏదైనా మాటల యుద్ధాలు ఉండవు. అదే ఆత్మకూరు నియోజకవర్గం. ప్రస్తుతం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం ఒకప్పుడు మేకపాటి కుటుంబం అడ్డా. కానీ గత ఎన్నికల్లో TDP గెలిచింది. అక్కడ TDP-YCP నాయకుల మధ్య ప్రశాంతం వాతావరణం ఉంటుంది. కానీ.. ఎన్నికలంటేనే ప్రధాన పార్టీల మధ్య పోటా పోటీ నెలకొంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.