News June 7, 2024
అవుకు మండలంలో పొంగిపొర్లుతున్న వాగు

అవుకు మండల పరిధిలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, ఎర్రమల కొండలనుంచి పారే జక్కలేరు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండల మధ్య నుంచి పారుతున్న జక్కలేరు వంక జలపాతాలు పకృతి అందాలు ఊటీని తలపిస్తూ పర్యాటకులకు కన్నుల పండుగగా కనిపిస్తుంది. అటు వర్షపు నీటి కారణంగా రిజర్వాయర్‌లో నీటి శాతం పెరిగి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 2, 2025
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి: కలెక్టర్

జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన అహింస, శాంతి మార్గాలను ఎంచుకొని ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. గురువారం పంచలింగాలలోని జిల్లా జైలులో ఖైదీల దినోత్సవం నిర్వహించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని జైలు ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పాల్గొన్నారు.
News October 2, 2025
మహాత్మా గాంధీ స్ఫూర్తితో యువతరం రాణించాలి: కలెక్టర్

మహాత్మా గాంధీ స్ఫూర్తితో నేటి యువతరం అన్ని రంగాల్లో రాణించి దేశాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కర్నూలులోని కలెక్టరేట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి కేఎంసీ కమిషనర్ విశ్వనాథ్‌తో
కలిసి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన కృషి వెలకట్టలేనిది కొనియాడారు.
News October 2, 2025
ఈ విషాదానికి 16 ఏళ్లు

2009 అక్టోబర్ 2న తుంగభద్ర, హంద్రీ నదుల ఉద్ధృతితో అతలాకుతలం చేసిన వరద కర్నూలు నగరాన్ని ముంచెత్తింది. ఇళ్లూ, ఆస్తులు, జ్ఞాపకాలు నీటిలో కొట్టుకుపోయాయి. అనేక కుటుంబాలు రోడ్లను ఆశ్రయించగా, వేలాది మంది తమ బంధువులను, జీవనాధారాలను కోల్పోయారు. నేటికి 16 ఏళ్లు గడిచినా ఆ భయం, బాధలు మిగిలే ఉన్నాయి. ఆ కష్టకాలాన్ని గుర్తుచేసుకుంటూ నగర ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.