News June 7, 2024

నెల్లూరు జిల్లాలో ఎన్నికల కోడ్ తొలగింపు

image

ఎన్నికల కౌంటింగ్ విజయవంతగా పూర్తవడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ గురువారం సాయంత్రంతో ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. పూర్తి చిత్తశుద్ధితో పని చేసిన ఎన్నికల సిబ్బందికి, పోలీస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, విద్యుత్ సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎస్పీ సమక్షంలో నిర్వహించిన పటిష్ఠ బందోబస్తు వలన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు.

Similar News

News January 31, 2026

నెల్లూరు: అప్పుడెందుకు నిద్రపోయారు.. ఇప్పుదెందుకు మేల్కొన్నారు!

image

వెంకటాచలంలో కొన్ని వేల మీటర్ల గ్రావెల్ తవ్వకాలు జరిగాయని 3 నెలల క్రితం విజిలెన్స్ అధికారులు ఆ శాఖ DGకి నివేదికిచ్చారు. నాలుగేళ్ల కిందట జరిపిన తవ్వకాలకు గత Oct.లో కాకాణి, అతని అనుచరులకు నోటీసులిచ్చారు. కాకాణి Decలో హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. రూ.53Cr జరిమానాగా అప్పట్లో విధించారని మైన్స్ DD శ్రీనివాసరావు Way2Newsకు తెలిపారు. అయితే అప్పట్లో జరగని ఎంక్వరీ ఇప్పుడేందుకని పలువురు చర్చించుకుంటున్నారు.

News January 31, 2026

నెల్లూరు: విద్యార్థులకు గమనిక

image

కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో వచ్చే నెల 9వ తేదీన ప్రేరణ ఉత్సవం ఫేస్-2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నెల్లూరు డీఈవో బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, సీబీఎస్ఈ పాఠశాలలు, కళాశాలల్లో 8వ తరగతి నుంచి 11 విద్యార్థులు ముందుగా https://prerana. education.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News January 31, 2026

నెల్లూరు: రూ.20లక్షల జీతాన్ని వదులుకుని..!

image

నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చెందిన రిటైర్డ్ జవాన్ గంగాధర్ కుమారుడు భారతాల ఉదయ్ శంకర్ గ్రూప్-1 ఫలితాల్లో సత్తాచాటాడు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చదివాడు. రూ.20లక్షల ప్యాకేజీతో సాప్ట్‌వేర్ జాబ్ చేసేవాడు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఆ జాబ్ వదిలేశాడు. కష్టపడి గ్రూప్-1లో పాస్ కావడంతో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అతనికి పలువురు అభినందనలు తెలిపారు.