News June 7, 2024
అవినీతి ఆరోపణలతో కర్ణాటక మంత్రి రాజీనామా

మనీలాండరింగ్ ఆరోపణలతో కర్ణాటక మంత్రి బి.నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం సిద్దరామయ్యకు సమర్పించగా, ఆయన దాన్ని గవర్నర్‌కు పంపించారు. నిధుల దుర్వినియోగానికి తమను సీనియర్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని KMVSTDC బోర్డు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సూసైడ్ నోట్ రాసి మే 26న ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ శాఖ మంత్రి బి.నాగేంద్రపై మనీలాండరింగ్ ఆరోపణలు మొదలయ్యాయి.
Similar News
News October 29, 2025
‘మొంథా’తో ఏపీకి తీవ్ర నష్టం: CBN

‘మొంథా’తో ఏపీకి తీవ్రనష్టం వాటిల్లిందని CM CBN తెలిపారు. తుఫాను తాకిన ప్రాంతంలో తీవ్ర గాలులు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలతో నష్టం వాటిల్లిందని వివరించారు. ‘ఈ పెనువిపత్తును ముందస్తు జాగ్రత్తలతో సమర్థంగా ఎదుర్కొన్నాం. ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తినష్టం లేకుండా కాపాడుకోగలిగాం. 200 క్యాంపుల్లో 1.80 లక్షల మందికి ఆశ్రయమిచ్చాం. యంత్రాంగం సమష్టిగా పనిచేసి ప్రజలను కాపాడింది’ అని వెల్లడించారు.
News October 29, 2025
కురవని కృత్రిమ వర్షం.. క్లౌడ్ సీడింగ్ వాయిదా!

కృత్రిమ వర్షంతో కాలుష్యాన్ని నియంత్రించాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలివ్వలేదు. మేఘాల్లో తేమ తక్కువగా ఉండటంతో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ సక్సెస్ కాలేదు. దీంతో ఈ రోజు నిర్వహించాల్సిన సీడింగ్‌ను వాయిదా వేశారు. మేఘాల్లో తేమ ఎక్కువగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి మంజీందర్ సిర్సా తెలిపారు. కాగా మొత్తంగా ₹3.2 కోట్ల ఖర్చుతో 5సార్లు ట్రయల్స్ నిర్వహించాలని ప్లాన్ చేశారు.
News October 29, 2025
భారీ వర్షంతో తొలి టీ20 రద్దు

ఆస్ట్రేలియా-భారత్ మధ్య కాన్‌బెర్రాలో జరిగే తొలి టీ20 రద్దయింది. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా దూకుడుగా ఆడింది. 9.4 ఓవర్లలో 97/1 రన్స్ చేసింది. అభిషేక్ 19 రన్స్ చేసి ఔటవ్వగా.. గిల్ 37*, సూర్య 39* దూకుడుగా ఆడారు.


