News June 7, 2024
తూ.గో.: 254 మందికి డిపాజిట్ గల్లంతు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 3 లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో ఈ ఎన్నికల్లో ప్రధానంగా కూటమి, వైసీపీ మధ్యనే పోటీ జరిగింది. అయితే కాంగ్రెస్‌తో పాటు స్వతంత్రులు కనీస ప్రభావం చూపలేకపోయారు. కూటమి, వైసీపీ మినహా మిగిలిన అభ్యర్థులెవరూ డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. కాకినాడ జిల్లాలో 92 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 97 మంది, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 20 మంది, వెరసి 254 మంది డిపాజిట్లు కోల్పోయారు.
Similar News
News September 13, 2025
వర్జీనియా పొగాకు ధర అధరహో

వర్జీనియా పొగాకు ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి. గత ఏడాది కిలో క్వాలిటీ పొగాకు గరిష్ఠ ధర రూ.411 ఆల్ టైమ్ రికార్డు కాగా ప్రస్తుతం రూ.418 పలికింది. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–32లో కిలో పొగాకు ధర రూ.418, వేలం కేంద్రం–18లో రూ.417, కొయ్యలగూడెంలో రూ.418, గోపాలపురంలో రూ.416, దేవరపల్లిలో రూ.416 ధర పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News September 13, 2025
తూ.గో: నేడు కలెక్టర్‌గా బాధ్యతలను చేపట్టనున్న కీర్తి

జిల్లా కలెక్టర్‌గా నియమితులైన చేకూరి కీర్తి నేడు విధుల్లో చేరనున్నారు. ప్రస్తుత కలెక్టర్ ప్రశాంతి ఆమెకు బాధ్యతలు అప్పగించనున్నారు. విశాఖకు చెందిన కీర్తి 2016లో 14వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించారు. తొలుత చిత్తూరు జిల్లా సబ్-కలెక్టర్‌గా, ఉమ్మడి తూ.గో జిల్లా జాయింట్ కలెక్టర్‌గానూ పని చేశారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో జాయింట్ డైరక్టర్‌గా ఉన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాకు ఈమె మూడోవ కలెక్టర్.
News September 12, 2025
తూ.గో జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నాతి బుజ్జి

గండేపల్లి మండల ఎంపీడీవోగా పనిచేసి, ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (DWMA)లో డీఎల్డీఓగా పదోన్నతి పొందిన నాతి బుజ్జి, తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చారు. శనివారం ఆమె హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం డిప్యుటేషన్ పద్ధతిలో జరిగిందని, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.