News June 7, 2024

KMM-NLG-WGL: ఎమ్మెల్సీ ఎన్నిక.. 40 మంది ఎలిమినేషన్

image

నల్గొండ పట్టణ పరిధిలోని దుప్పలపల్లి FCI గోదాంలో KMM-NLG-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం రాత్రి నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించగా ఇప్పటి వరకు 40 మందిని ఎలిమినేషన్ చేశారు. బీజేపీ అభ్యర్థి ప్రేమ్ చందర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ ఎలిమినేషన్ తర్వాతనే ఫలితం తేలనుంది.

Similar News

News November 6, 2025

నల్గొండ: దూడకు రెండే కాళ్లు..!

image

తిప్పర్తి మండలం పజ్జూరులో రైతు జంజీరాల గోపాల్‌కు చెందిన గేదె రెండు కాళ్ల దూడకు జన్మనిచ్చింది. దూడకు కేవలం ముందు కాళ్లు మాత్రమే ఉన్నాయని, వెనుక కాళ్లు లేవని రైతు తెలిపారు. దూడ ఆరోగ్యంగానే ఉందని ఆయన చెప్పారు. ఈ దూడను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు.

News November 6, 2025

మిర్యాలగూడ: 100 గొర్రెలు మృతి

image

100 గొర్రెలు ఆకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వేములపల్లి మండలంలో జరిగింది. పెన్ పహాడ్ మండలానికి చెందిన గొర్ల కాపర్లు సైదులు, నాగరాజు, కోటయ్య, శ్రీరాములు, ఉపేందర్ మరో ఇద్దరు కలిసి గొర్లను మేపుకుంటూ నాలుగు రోజుల క్రితం వేములపల్లి శివారుకు చేరుకున్నారు. అక్కడే మేపుతుండగా ఒకేసారి గొర్లు చనిపోయాయని కాపర్లు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News November 6, 2025

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

నల్గొండ మండలం చర్లపల్లిలోని హాకా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించి, కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తడవకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లారీల కొరత లేకుండా సకాలంలో వాటిని వెంటవెంటనే పంపించాలని పేర్కొన్నారు.