News June 7, 2024
NEET ఫలితాలపై స్పందించిన సీఎం స్టాలిన్
నీట్ యూజీ ఫలితాలపై TN సీఎం స్టాలిన్ స్పందించారు. ‘తాజా నీట్ ఫలితాలు మేమెందుకు ఆ పరీక్షకు వ్యతిరేకమో నిరూపించాయి. సుసాధ్యం కాని గ్రేస్ మార్కుల ముసుగులో ప్రశ్నాపత్రం లీక్, ఒకే కేంద్రంలో టాపర్స్ ఉండటం వంటివి నీట్ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. నీట్ పేదలకు వ్యతిరేకం. అవి ఫెడరల్ పాలిటీని దెబ్బతీస్తాయి. ఇది అవసరమైన చోట వైద్యుల లభ్యతపై ప్రభావం చూపుతుంది. నీట్‌కు వ్యతిరేకంగా పోరాడదాం’ అని Xలో పోస్ట్ చేశారు.
Similar News
News January 11, 2025
193 ఏళ్ల క్రితం నీలవర్ణంలో సూర్యుడు.. కారణమిదే
1831లో ఓ విచిత్రం జరిగింది. ప్రపంచానికి సూర్యుడు నీలవర్ణంలో కనిపించాడు. దానికి కారణాన్ని స్కాట్లాండ్ పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. రష్యా సమీపంలోని జవారిట్స్కీ అనే అగ్నిపర్వతం ఆ ఏడాది విస్ఫోటనం చెందిందని గుర్తించారు. దాన్నుంచి భారీగా వెలువడిన సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణాన్ని కమ్మేసిందని పేర్కొన్నారు. అగ్నిపర్వత విస్ఫోటనం భూ వాతావరణాన్ని పూర్తిగా మార్చడానికి భవిష్యత్తులోనూ ఛాన్స్ ఉందని హెచ్చరించారు.
News January 11, 2025
రిగ్రెట్‌గా ఫీలవుతారు.. NRIలకు మోదీ వార్నింగ్!
NRIలు వెంటనే స్వదేశానికి తిరిగొచ్చేయాలని బహిరంగంగా పిలుపునిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. ‘ప్రపంచం చాలా మారిపోతోంది. ఒకవేళ మీరు భారత్‌కు రాకపోతే రిగ్రెట్‌గా ఫీలవుతారు’ అని హెచ్చరించారు. ‘CMగా ఉన్న నాకు 2005లో US వీసా నిరాకరించింది. భారత వీసా కోసం ప్రపంచం క్యూలో నిలబడే రోజు వస్తుందని అప్పుడే చెప్పా. ఇప్పుడు భారత్‌కు ఆ టైమ్ వచ్చేసింది. గత 2 దశాబ్దాల్లో దేశం చాలా పురోగతి సాధించింది’ అని అన్నారు.
News January 11, 2025
‘చాయ్ వాలే బాబా’ గురించి ఈ విషయాలు తెలుసా?
UPలోని ప్రతాప్ గఢ్‌కు చెందిన దినేశ్ స్వరూప్ బ్రహ్మచారి తొలుత చాయ్ అమ్మేవాడు. దీంతో సాధువుగా మారిన తర్వాత ఆయనను ‘<<15114642>>చాయ్ వాలే బాబా<<>>’గా పిలుస్తున్నారు. 40 ఏళ్లుగా తిండి లేకుండా, రోజుకు 10 కప్పుల చాయ్ తాగుతూ జీవిస్తున్నారు. మౌనం శక్తిని పోగు చేస్తుందని నమ్మే ఆయన చాలా ఏళ్లుగా మాట్లాడటం మానేశారు. సివిల్స్ అభ్యర్థులకు ఆయన వాట్సాప్ ద్వారా సందేహాలను నివృత్తి చేస్తుండటం మరో విశేషం.