News June 7, 2024

జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలి.. కోర్టును కోరిన MLC కవిత

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కవితకు మరో షాక్ తగిలింది. సీబీఐ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు.. కవితకు ఈ నెల 21 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి కవిత 9 పుస్తకాలు కోరగా ఆ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది.

Similar News

News January 13, 2026

డయాబెటిస్ భారం.. భారత్‌కు రెండో స్థానం

image

డయాబెటిస్ వల్ల అత్యధిక ఆర్థిక భారం పడుతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా అధ్యయనం ప్రకారం ఇండియాపై డయాబెటిస్ కారణంగా 11.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం పడుతోంది. ఈ జాబితాలో US 16.5 ట్రిలియన్ డాలర్లతో టాప్‌లో ఉండగా, 11 ట్రిలియన్ డాలర్లతో చైనా మూడో స్థానంలో ఉంది. వైద్య ఖర్చులు పెరగడం ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News January 13, 2026

లింగాకర్షక బుట్టలతో పురుగుల బెడద తగ్గుతుంది

image

లింగాకర్షక బుట్టల్లో ఉండే ‘ల్యూర్’ మగ రెక్కల పురుగులను ఆకర్షిస్తుంది. ఫలితంగా మగ, ఆడ రెక్కల పురుగుల మధ్య కలయిక జరగకుండా వాటి సంతానోత్పత్తి వృద్ధి చెందకుండా ఉంటుంది. కత్తెర పురుగు, గులాబి రంగు పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, కూరగాయల్లో పండుఈగ, కొబ్బరి, ఆయిల్ పామ్‌లో కొమ్ము పురుగులకు ప్రత్యేకమైన ల్యూర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని పొలంలో అమర్చి వాటి ఉద్ధృతిని అదుపులో ఉంచుకోవచ్చు.

News January 13, 2026

భోగి పండుగ పరమార్థం ఇదే..

image

మనలోని, మన చుట్టూ ఉన్న వ్యర్థాలను తొలగించి కొత్త వెలుగులకు స్వాగతం పలకడమే భోగి పరమార్థం. భోగి మంటల్లో ఆవు పిడకలు, పాత చెక్క సామాను వేస్తారు. దీని నుంచి వచ్చే పొగ సూక్ష్మజీవులను చంపి మనకు ఆరోగ్యాన్నిస్తుంది. అలాగే మనలోని పాత ఆలోచనలు, బాధలను దహించి అభివృద్ధి పథంలో సాగాలని సూచిస్తుంది. చలిని తరిమికొట్టి, అజ్ఞానమనే చీకటిని తొలగించి, సర్వ శుభాలు కలిగించే నూతన చైతన్యాన్ని ఈ పండుగ మనకు ప్రసాదిస్తుంది.