News June 7, 2024

శ్రీకాకుళం: డబుల్ రికార్డ్ బ్రేక్ చేసిన కలిశెట్టి

image

విజయనగరం ఎంపీగా గెలుపొందిన కలిశెట్టి అప్పలనాయుడు డబుల్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇంతవరకు ఇక్కడ MPలుగా గెలిచిన వారెవరికీ రాని మెజార్టీ అప్పలనాయుడు సాధించడం ఒకటి కాగా, శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం MPగా ఎన్నికైన తొలి నాయకుడిగా రికార్డు సృష్టించారు. అప్పలనాయుడు YCP ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ మీద 2,38,216 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే.

Similar News

News January 16, 2026

శ్రీకాకుళం జిల్లా మీదగా అమృత్ భారత్ స్లీపర్ ట్రైన్..రేపట్నుంచే

image

రైలు ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. న్యూజల్ పాయ్ గురి నుంచి శ్రీకాకుళం మీదుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 17న మధ్యాహ్నం న్యూజల్‌పాయ్‌గురిలో 1:45కు బయలదేరి మరుసటి రోజు సోంపేట-10:44, ఇచ్ఛాపురం-11:01, పలాస-11:46, శ్రీకాకుళం-12:38గంటలకు చేరుకుంటుంది.

News January 16, 2026

శ్రీకాకుళం: నేటి నుంచి ఇక్కడ సంక్రాంతి మొదలు

image

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని <<18868852>>కొసమాలలో<<>> దేవాంగుల వీధిలో కనుమ రోజున భోగి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వీధిలోని చేనేత కార్మికులు నేడు భోగి వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. నందిగాం పరిధిలోని పెద్దతామరాపల్లిలోనున్న పెద్దదేవాంగులవీధిలో ఇదే ఆచారాన్ని పాటిస్తారు. మీ పరిధిలో నేటి సంక్రాంతి వేడుకలను జరుపుకుంటే కామెంట్‌లో తెలపండి.

News January 16, 2026

ఎల్.ఎన్.పేట: పండగపూట విషాదం.. యువకుడు మృతి

image

ఎల్.ఎన్.పేట(M) మోదుగువలస నిర్వాసితుల కాలనీకి చెందిన సాయికుమార్(25) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. భోగి రోజు సాయికుమార్ మరో యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తూ స్కాట్ పేట వద్ద నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీకొని కిందపడ్డారు. సాయికుమార్ మృతితో గ్రామంలో విషాద చ్ఛాయలు అలముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసినట్లు సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి తెలిపారు.