News June 7, 2024
టీచర్ల బదిలీల కోసం లంచాలు తీసుకోలేదు: బొత్స

AP: ఉపాధ్యాయ బదిలీల కోసం తాను లంచాలు తీసుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అవసరం, అగత్యం తనకు లేదన్నారు. ‘టీచర్ల బదిలీలు నిలిపేయాల్సిందిగా నేనే అధికారులకు విజ్ఞప్తి చేశా. బదిలీల్లో అవకతవకలు జరిగాయనేది అవాస్తవం. కొత్త ప్రభుత్వం టీచర్ల బదిలీలపై నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 12, 2025
తేజా సజ్జ ‘మిరాయ్’ పబ్లిక్ టాక్

కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’లో తేజా సజ్జ, మంచు మనోజ్ నటనతో మెప్పించారని ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ SMలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కథా నేపథ్యం, విజువల్స్, BGM ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. కొన్ని సీన్లు గతంలో చూసిన మాదిరిగా అనిపిస్తాయని, క్లైమాక్స్ మెరుగ్గా ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కాసేపట్లో Way2News రివ్యూ&రేటింగ్.
News September 12, 2025
ఈ నెల 16 నుంచి MBBS, BDS కౌన్సెలింగ్

TG: MBBS, BDS ప్రవేశాల కోసం ఈ నెల 16 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటిస్తూ కాళోజీ హెల్త్ వర్సిటీ షెడ్యూల్ విడుదల చేసింది. 15న జనరల్ మెరిట్ లిస్టును వెబ్‌సైట్‌లో పెట్టనుండగా, ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ 16న ప్రారంభవుతుంది. 17-19 తేదీల్లో వెబ్ ఆప్షన్స్, 20-24 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్, 2nd ఫేజ్‌లో 26-28 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు, 29న కాలేజీల్లో రిపోర్టింగ్ ఉంటుంది.
News September 12, 2025
దసరాకు ‘ఆదిత్య 999’ సినిమా ప్రకటన?

క్రిష్ జాగర్లమూడి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ‘ఆదిత్య 999’ సినిమా తెరకెక్కనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై దసరా పండుగ రోజున అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీకి బాలయ్యే స్టోరీ అందించినట్లు సమాచారం. గతంలో క్రిష్-బాలయ్య కాంబోలో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథా నాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.