News June 7, 2024

గవర్నర్‌తో నూతన సీఎస్ నీరభ్ భేటీ

image

AP: విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో నూతన సీఎస్ నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎస్‌కు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇప్పటి వరకు సీఎస్‌గా విధులు నిర్వహించిన జవహర్‌రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

Similar News

News January 8, 2026

అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు

image

AP: రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విజయవాడలో ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే ఈవెంట్స్ జరిగేవి. ఇకపై అమరావతిలోనే వీటిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రుల బంగ్లాలకు ఎదురుగా 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. మరో పదెకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకలకు గవర్నర్ జస్టిస్ నజీర్, CM చంద్రబాబు సహా 500 మంది అతిథులు హాజరవనున్నారు.

News January 8, 2026

యూరియా తీసుకున్న రైతులపై నిఘా

image

TG: ఒకేసారి 40-50 బస్తాల యూరియా కొనుగోలు చేసిన రైతులపై వ్యవసాయ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. 4 జిల్లాల్లో అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి రావడంతో క్షేత్రస్థాయి విచారణకు రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. రైతుల భూమి విస్తీర్ణం, పంటలు, యూరియా అవసరం, వినియోగాన్ని పరిశీలించనున్నాయి.

News January 8, 2026

మిరపలో వేరుపురుగు నివారణకు సూచనలు

image

మిరపలో వేరు పురుగు నివారణకు ముందుగా వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. క్లోరోఫైరిఫాస్ 8 మి.లీ ఒక కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. జీవ సంబంధిత మెటారైజియం ఎనాయిసోప్లి వేర్ల దగ్గర పోయాలి. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 5-10 కిలోలు పొడి ఇసుకతో కలిపి నేలలో తేలికపాటి తడి ఉన్నప్పుడు సాళ్ల వెంట వేసుకోవాలి. అలాగే ఎకరాకు 10కిలోల వేపపిండి వేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.