News June 7, 2024
సీఎంతో ముఖాముఖి కార్యక్రమానికి జన్నారం విద్యార్థి

సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖి కార్యక్రమానికి జన్నారం మండలంలోని కిష్టాపూర్ జడ్పీ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థి రాథోడ్ ఈశ్వర్ ఎంపికయ్యారు. జూన్ 9న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో విద్యాశాఖ సహకారంతో పదో తరగతి టాపర్లతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ నెల 10న హైదరాబాద్‌లోని హరిహర కళాక్షేత్రంలో విద్యార్థులను, హెచ్ఎంలను, తల్లిదండ్రులను ఆయన సన్మానించనున్నారు.
Similar News
News March 2, 2026
హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ADB SP

హోలీ పండుగను మతసామరస్యంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తుతో పాటు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామన్నారు. డీజేలకు అనుమతి లేదని, ఎవరిపై బలవంతంగా రంగులు చల్లరాదని హెచ్చరించారు. ఈత రానివారు చెరువులు, వాగుల వద్దకు వెళ్లకూడదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
News March 2, 2026
ADB: పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలలు బంగారుగూడ, జైనథ్, బజార్హత్నూర్, నార్నూర్, గుడిహత్నూర్, బోథ్ ప్రవేశ పరీక్ష -2026-27 విద్యా సంవత్సరానికి VI తరగతిలో ప్రవేశాలకు గడువు తేదీని పొడగించినట్లు DEO రాజేశ్వర్ పేర్కొన్నారు. అలాగే VII నుంచి X తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ మార్చి10 వరకు పొడగించమన్నారు. ఏప్రిల్ 19న పరీక్ష ఉంటుందని తెలిపారు.
News March 2, 2026
ADB: ‘హెల్త్ మిషన్ – 100’ ప్రారంభం

ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘హెల్త్ మిషన్ – 100’ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో హెల్త్ మిషన్ – 100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కౌమార దశలోని వారు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.


